బిజినెస్

డిఫాల్టర్లపై నిషేధం విధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: బ్యాంకుల రుణాలను ఎగవేసిన వారిని రాజ్యసభ ఎంపికకు అనర్హులుగా ప్రకటిస్తూ సభలో ఒక తీర్మానం చేయాలనే ఒత్తిడి పెరుగుతోంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్‌తోపాటు పలువురు ఇతర సీనియర్ నాయకులు ఈ ప్రతిపాదనను రాజ్యసభలో ప్రతిపాదించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. బ్యాంకు రుణాలను ఎగవేయటం అంటే ప్రజాధనాన్ని కొల్లగొట్టటమే కాబట్టి అలాంటి వారు రాజ్యసభకు ఎన్నిక కాకుండా చూడాలనీ, ఈ మేరకు రాజ్యసభలో ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని పలువురు సభ్యులు రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీకి సూచించినట్లు తెలిసింది. బ్యాంకుల నుండి వందలు, వేల కోట్ల రుణాలు తీసుకుని ఆ తరువాత రకరకాల తప్పుడు కారణాలు చూపిస్తూ రుణాలు చెల్లించకుండా ఎగవేస్తున్నారని, ఇలాంటి వారు రాజ్యసభలో ఉండటం వలన రాజ్యసభ పరువుప్రతిష్ఠలు దెబ్బతింటున్నాయని, రాజ్యసభ సభ్యులంతా ఇలాంటి వారేననే చెడ్డపేరు వస్తోందని వారు హమీద్ అన్సారీ దృష్టికి తెచ్చినట్లు చెబుతున్నారు. బ్యాంకులకు ఎగ్గొట్టిన డబ్బుతో వారు రాజ్యసభకు ఎన్నికవుతున్నారని ఒక సీనియర్ నాయకుడు హమీద్ అన్సారీతో చెప్పారని అంటున్నారు. వివిధ బ్యాంకుల నుండి రుణాలు తీసుకుని ఎగవేసిన కనీసం ఐదుగురు ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారని, ఒకరిద్దరు కేంద్ర మంత్రివర్గంలో పదవులు నిర్వహిస్తున్నారని వారంటున్నారు. కర్నాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందిన వీరివలన పార్లమెంటుకు చెడ్డపేరు వస్తుందని వారు వాదిస్తున్నారు. బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయలను ఎగవేసిన ఆరోపణల్లో ఇరుక్కున్న రాజ్యసభ సభ్యుడు విజయ మాల్యా జూన్ నెలలో రిటైర్ అవుతున్నారు. విజయ మాల్యా మరోసారి కన్నాటక నుండి రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి వై.ఎస్. (సుజనా)చౌదరి కూడా జూన్‌లోనే రిటైర్ అవుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈసారి ఆయనను రాజ్యసభకు పంపించకపోవవచ్చుననే ప్రచారం జరుగుతోంది.