బిజినెస్

నేడు మాల్యా వ్యవహారంపై సుప్రీం విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా.. దేశం విడిచి వెళ్లిపోకుండా అడ్డుకోవాలన్న ప్రభుత్వరంగ బ్యాంకర్ల పిటిషన్‌ను సుప్రీం కోర్టు బుధవారం విచారించనుంది. వేల కోట్ల రూపాయలు బకాయిపడి, దేశం విడిచి వెళ్లిపోయేందుకు చూస్తున్నారంటూ ఎస్‌బిఐసహా 13 బ్యాంకులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. బ్యాంకుల తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగి హాజరై ఈ కేసును అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీనిపై చీఫ్ జస్టిస్ టిఎస్ థాకూర్, జస్టిస్ యుయు లలిత్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ‘పిటిషన్‌పై రేపు విచారణ జరుపుతాం’ అని స్పందించింది. 17 ప్రభుత్వరంగ బ్యాంకులకు మాల్యా నేతృత్వంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ 7,000 కోట్ల రూపాయలకుపైగా బకాయి పడినది తెలిసిందే. ఇప్పటికే మాల్యాను ఈ వ్యవహారంలో ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా బ్యాంకులు ప్రకటించాయి. కాగా, యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న క్రమంలో డియాజియో ఇచ్చే 515 కోట్ల రూపాయల పారితోషికాన్ని మాల్యా డ్రా చేసుకోవడానికి వీల్లేదని సోమవారం డెబ్ట్ రికవరీ ట్రిబ్యునల్ ఆదేశాలు జారి చేసినది విదితమే. మాల్యాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసును కూడా నమోదు చేసింది. మరోవైపు వైట్ కాలర్ నేర విచారణ సంస్థ ఎస్‌ఎఫ్‌ఐఒ.. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ వ్యవహారంలో నిధులు దారి మళ్లాయన్న ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ మేరకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం రాజ్యసభకు ఓ లిఖితపూర్వక సమాధానమిచ్చారు.