బిజినెస్

ఆనంద్ మహీంద్రకు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మహీంద్ర అండ్ మహీంద్ర చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ మహీంద్రకు ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం చెవలియెర్ డి లా లీజియన్ డి’హానర్ (నైట్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ హానర్) దక్కింది. భారత్‌కు ఫ్రాన్స్ అంబాసిడర్ అయిన ఫ్రాంకోయిస్ రిచెర్ ఈ నెల 5న ఆనంద్ మహీంద్రకు ఈ అవార్డును అందించినట్లు ఓ ప్రకటనలో మహీంద్ర అండ్ మహీంద్ర మంగళవారం తెలిపింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆనంద్ మహీంద్ర చేసిన కృషికి ఈ గౌరవం దక్కిందని పేర్కొంది.

మహిళలకు ఎస్‌బిఐ లైఫ్ సరికొత్త ప్లాన్
న్యూఢిల్లీ, మార్చి 8: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ.. బీమారంగ సంస్థ అయిన ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ మంగళవారం ‘ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ ఉమెన్ అడ్వాంటేజ్’ ప్లాన్‌ను ఆవిష్కరించింది. స్ర్తిల కోసం ప్రత్యేకంగా తెచ్చిన దీనివల్ల జీవిత బీమాతోపాటు, సేవింగ్స్, స్ర్తిలకు మాత్రమే వచ్చే కొన్ని రకాల వ్యాధులకు, ఆరోగ్య సమస్యలకు చికిత్స తదితర ప్రయోజనాలు అందుకోవచ్చని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80డి, 80సి క్రింద పన్ను ప్రయోజనాలు పొందవచ్చంది. ఇందులో గోల్డ్ ప్లాన్, ప్లాటినమ్ ప్లాన్ ఉంటాయంది.

ఎస్సార్ పవర్ ఎంపికి సిఇఒగా కెవిబి రెడ్డి
న్యూఢిల్లీ, మార్చి 8: ఎస్సార్ పవర్ ఎంపి లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ)గా కెవిబి రెడ్డి అదనపు బాధ్యతలు అందుకోనున్నారు. ఈ మేరకు మంగళవారం ఎస్సార్ పవర్ ప్రకటించింది. తమ ప్రకటన వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. విద్యుత్ పరిశ్రమలో కెవిబి రెడ్డికి 32 సంవత్సరాల అనుభవం ఉండగా, ఎస్సార్ పవర్ ప్రాజెక్టులన్నీ కూడా ఆయన పర్యవేక్షణలోనే జరుగుతున్నాయి. 1995లో ఆయన ఎస్సార్ పవర్‌లోకి వచ్చారు. 2015 అక్టోబర్ నుంచి ఎస్సార్ పవర్ సిఇఒగా కొనసాగుతున్నారు.