బిజినెస్

విపిటిలో మరో 5 మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి ప్రతిపాదనలు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: విశాఖపట్నం పోర్టు ట్రస్టు సోలార్ విద్యుత్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం 10 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. అయతే దీనికి అదనంగా మరో 5 మెగావాట్ల ప్లాంట్‌కు విశాఖపట్నం పోర్టు ట్రస్టు (విపిటి) ప్రతిపాదించింది. దీర్ఘకాలిక పచ్చదనం పెంపు ప్రణాళికలో భాగంగా దీన్ని ప్రతిపాదించారు. దేశంలోనే సోలార్ విద్యుదుత్పత్తి చేస్తున్న తొలి ప్రధాన రేవు విశాఖపట్నం పోర్టు. ఇప్పటికే రెండు మెగావాట్ల విద్యుదుత్పత్తి పోర్టులో ప్రారంభమైంది. దేశంలోని 8 ప్రధాన రేవుల్లో సోలార్ విద్యుదుత్పత్తి చేసేందుకు కేంద్ర నౌకాయాన మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది. 2020 నాటికి ఈ రేవుల్లో 135 మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తికి ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా విశాఖ పోర్టు ట్రస్టులో రూ. 57 కోట్లతో 10 మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి చేసేందుకు ప్రతిపాదించారు. గత ఏడాది అక్టోబర్‌లో ఈ మేరకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఇండియన్ పోర్ట్సు అసోసియేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖ పోర్టులో ప్లాంట్ నిర్మాణానికి కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ పనులు కూడా ప్రారంభించింది. ఇప్పటికే రెండు మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు. మిగిలిన 8 మెగావాట్లకు సంబంధించిన పనులను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.