బిజినెస్

ఎటువంటి హామీ ఇవ్వలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: స్టాక్ మార్కెట్లలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఇపిఎఫ్‌ఓ) పెట్టే పెట్టుబడుల భవితవ్యం ఆయా మార్కెట్ల ఒడిదుడుకులకు లోబడే ఉంటుందని, వీటికి తాము ఎటువంటి హామీ ఇవ్వలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ బుధవారం రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘స్టాక్ మార్కెట్లలో ఇపిఎఫ్‌ఓ పెట్టుబడులకు ప్రభుత్వం ఎటువంటి గ్యారంటీ ఇవ్వలేదు. ఈ పెట్టుబడులన్నీ స్టాక్ మార్కెట్ల ఒడిదుడుకులకు లోబడే ఉంటాయి’ అని ఆయన తెలిపారు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం రిస్కుతో కూడిన వ్యవహారమని కొన్ని కార్మిక సంఘాలు ఆందోళన చెందుతున్నాయని, అందువల్లనే అవి ఈక్విటీల్లో ఇపిఎఫ్‌ఓ పెట్టుబడులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆగస్టు 6వ తేదీ నుంచి ఇటిఎఫ్ (ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్)లో పెట్టుబడులు పెడుతున్న ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తమ ఇంక్రిమెంటల్ డిపాజిట్స్‌లో 5 శాతం నిధులను ఇటిఎఫ్‌లలో పెట్టుబడులుగా పెట్టాలని భావిస్తోంది. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు రిస్కు ఎదురయ్యే అవకాశాలను పరిశీలించిన తర్వాతే ఇపిఎఫ్‌ఓలోని అత్యున్నత నిర్ణాయక విభాగమైన సిబిటి (సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీలు) ఎక్సేంజ్ ట్రెడెడ్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలన్న ప్రతిపాదనను ఆమోదించిందని దత్తాత్రేయ సభకు వివరించారు.
ఇటిఎఫ్‌లలో ఈ ఏడాది
రూ.6 వేల కోట్ల పెట్టుబడులు?
ఇదిలావుంటే, ఆగస్టు 6వ తేదీ నుంచి ఇటిఎఫ్‌లలో పెట్టుబడులు పెడుతున్న ఇపిఎఫ్‌ఒ నవంబర్ 30వ తేదీ వరకు మొత్తం 3,174 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా మంగళవారం పార్లమెంట్‌కు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇంక్రిమెంటల్ డిపాజిట్ల రూపంలో రూ.1.2 లక్షల కోట్లు జమ అవుతాయని ఇపిఎఫ్‌ఓ అంచనా వేస్తోంది. దీని ప్రకారం 2015-16లో ఇపిఎఫ్‌ఓ దాదాపు 6 వేల కోట్ల రూపాయలను ఇటిఎఫ్‌లలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది.

రాజ్యసభలో వివరాలు వెల్లడిస్తున్న కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ