బిజినెస్

కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాటా విక్రయానికి విశేష స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాటా విక్రయానికి సంస్థాగత మదుపరుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్‌ఐసి తదితర సంస్థాగత మదుపరులు 1,887 కోట్ల రూపాయల విలువైన బిడ్లను దాఖలు చేశారు. 1,165 కోట్ల రూపాయల విలువైన 5 శాతం వాటాను కేంద్ర ప్రభుత్వం.. అమ్మకానికి పెట్టినది తెలిసిందే. ఈ క్రమంలోనే రెండు రోజుల పాటు జరిగే ఈ వాటా విక్రయం బుధవారం మొదలవగా, ముందుగా సంస్థాగత మదుపరుల నుంచి బిడ్లను ఆహ్వానించారు. దీంతో కేటాయించిన 77.98 లక్షల షేర్లకుగాను 1.57 కోట్ల బిడ్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఈ వాటా విక్రయం నుంచి ఖజానాకు నిధులు రానున్నాయి. మరోవైపు గురువారం రిటైల్ మదుపరులకు కేటాయించిన 19.49 లక్షల షేర్లకు సంబంధించి వారి నుంచి బిడ్లను స్వీకరించనున్నారు. 1,195 రూపాయలకు ఒక్కో షేర్ చొప్పున ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఈ వాటా అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవగా, పాలనాపరంగా రైల్వే మంత్రిత్వ శాఖ అధీనంలో ఉన్న కంటైనర్ కార్పొరేషన్స్ ఆఫ్ ఇండియాలో ప్రభుత్వానికి 61.80 శాతం వాటా ఉంది. ఈ నెల 31తో ముగిసిపోతున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16)లో ప్రభుత్వరంగ సంస్థల వాటాల విక్రయం ద్వారా 41,000 కోట్ల రూపాయలను అందుకోవాలని నరేంద్ర మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకున్నది తెలిసిందే. అయితే ప్రతికూల పరిస్థితుల మధ్య ఈ లక్ష్యాన్ని 25,000 కోట్ల రూపాయలకు కుదించగా, ఇప్పటిదాకా 18,000 కోట్ల రూపాయలకుపైగా నిధులను మాత్రమే పొందింది. ఐఒసి, ఎన్‌టిపిసి, ఇఐఎల్, పిఎఫ్‌సి, ఆర్‌ఇసి, డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌లలో వాటాలను విక్రయించి ఈ 18,000 కోట్ల రూపాయలను అందుకుంది.