బిజినెస్

దేశం వీడిన మాల్యా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: విజయ్ మాల్యా విదేశాలకు వెళ్లిపోయాడని బుధవారం కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలియజేసింది. ప్రభుత్వరంగ బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయలకుపైగా బకాయిపడిన మాల్యాపై బాధిత బ్యాంకర్లు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించినది తెలిసిందే. ఉద్దేశపూర్వకంగా రుణాల ఎగవేతకు మాల్యా పాల్పడుతున్నారని, అరెస్టు చేసి, పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాలని ఎస్‌బిఐసహా 13 బ్యాంకులు సుప్రీంలో పిటిషన్ వేశాయి. దీనిపై జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారీమన్‌లతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ మాల్యాకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా సమాధానమివ్వాలంటూ ఆదేశించింది. అయితే మాల్యా ఈ నెల 2న దేశం విడిచి వెళ్ళిపోయారని, కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ తెలిపిందంటూ ఈ కేసులో బ్యాంకుల తరఫున వాదిస్తున్న అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగీ ధర్మాసనానికి తెలియజేశారు. బ్రిటన్‌కు వెళ్లి ఉంటారన్న సమాచారమిచ్చారు. దీంతో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మాల్యా అధికారిక ఈమెయిల్ ఐడి, లండన్‌లోని భారత హైకమిషన్, ఈ కేసులో వివిధ కోర్టుల్లో మాల్యా తరఫున వాదిస్తున్న లాయర్లు, డెబ్ట్ రికవరీ ట్రిబ్యునల్, ఆయన సంస్థలకు వాటి ద్వారా మాల్యాకు నోటీసులు అందేలా చూడాలని న్యాయస్థానం సూచించింది.
సిబిఐ వైఫల్యం
మరోవైపు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి 8 నెలలు గడుస్తున్నా వివిధ దేశాల న్యాయస్థానాలకు ఈ కేసుకు సంబంధించి న్యాయపరమైన సహాయార్థం లెటర్ రోగేటరీలను పంపించడంలో సిబిఐ విఫలమైంది. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఐడిబిఐ నుంచి తీసుకున్న రుణాలను ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ యాక్సిస్‌కు బదిలీ చేసి వాటిని విదేశీ అవసరాల నిమిత్తం వాడుకున్నారని సిబిఐ అనుమానిస్తోంది. ప్రభుత్వరంగ బ్యాంకులకు మాల్యా నేతృత్వంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ 7,000 కోట్ల రూపాయలకుపైగా బకాయిపడినది తెలిసిందే. ఈ రుణాలు మొండి బకాయిలుగా మారగా, వీటి వసూలుకు బ్యాంకర్లు న్యాయపోరాటానికి దిగారు. ఈ క్రమంలోనే సిబిఐ రంగప్రవేశం చేసి 2015 జూలై 28న ఈ వ్యవహారంలో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసింది. ఆ తర్వాత మూడు నెలలకు సోదాలు నిర్వహించగా, ఆ సమయంలో లెటర్ రోగేటరీలను పంపుతున్నారా? అన్నదానికి సమాధానంగా అదే పనిలో ఉన్నామని సిబిఐ సమాధానమిచ్చింది. అయితే మాల్యా విదేశాలకు వెళ్లే వీలుందన్న సమాచారమున్నప్పటికీ లెటర్ రోగేటరీలను సిబిఐ ఇంకా పంపించలేదని ఇప్పుడు తెలిసింది. దీంతో సిబిఐ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇటీవల ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్‌ను ఉద్దేశించి సిబిఐ డైరెక్టర్ అనిల్ సిన్హా మాట్లాడుతూ 2004-2012 మధ్య బ్యాంకులు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు రుణాలిచ్చాయని, 2015 జూలైలో కేసు నమోదైందని, ఆ తర్వాత తమకు ఫిర్యాదు చేయాలని ఎన్నిసార్లు కోరినా బ్యాంకులు పట్టించుకోలేదని అన్నారు.
ఇదిలావుంటే కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ చీఫ్ విజయ్ మాల్యా, ఆ సంస్థ డైరెక్టర్ల నుంచి రావాల్సిన కోట్లాది రూపాయల బకాయిలపై సర్వీస్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వేసిన పిటిషన్‌పై విచారణను బాంబే హైకోర్టు బుధవారం ఈ నెల 11కు వాయిదా వేసింది. మొత్తం బకాయిలు 535 కోట్ల రూపాయలైతే, ఇందులో 56.06 కోట్ల రూపాయల బకాయిలను కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అంగీకరించినట్లు న్యాయస్థానానికి ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాది వివరించారు. సవరించిన ఆర్థిక చట్టంలోని వివిధ ప్రొవిజన్లు, సెక్షన్ 89 (1)(డి)ని మాల్యా, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఉల్లంఘించాయని కూడా చెప్పారు.