బిజినెస్

కోలుకోని ఎగుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశీయ ఎగుమతులు వరుసగా 15వ నెలా క్షీణించాయి. గత నెల ఫిబ్రవరిలో 5.66 శాతం పడిపోయి 20.73 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల మధ్య పెట్రోలియం, ఇంజినీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో ఎగుమతులు కోలుకోలేకపోయాయి. మరోవైపు గతంతో పోల్చితే దిగుమతులు 5.03 శాతం తగ్గి 27.28 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఫలితంగా వాణిజ్య లోటు దాదాపు ఐదేళ్ల కనిష్టాన్ని తాకుతూ 6.54 బిలియన్ డాలర్ల వద్ద నిలిచింది. 2011 మార్చిలో నమోదైన వాణిజ్య లోటు 5.6 బిలియన్ డాలర్ల తర్వాత మళ్లీ అతి తక్కువగా ఉండటం ఇదే. గత ఏడాది ఫిబ్రవరిలో ఇది 6.74 బిలియన్ డాలర్లుగా ఉంది. వాణిజ్య మంత్రిత్వ శాఖ మాట్లాడుతూ ప్రపంచంలోని ప్రధాన దేశాల ఎగుమతులన్నీ కూడా పతనం దిశగానే పయనిస్తున్నాయని, గత ఏడాది డిసెంబర్‌లో అమెరికా ఎగుమతులు 10.35 శాతం పడిపోతే, ఐరోపా దేశాల ఎగుమతులు 7.62 శాతం, చైనా ఎగుమతులు 1.67 శాతం క్షీణించాయని తెలిపింది.
ఇదిలావుంటే భారత ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్‌ఐఇఒ) స్పందిస్తూ ఎగుమతులు ఇలాగే కొనసాగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16)లో 260 బిలియన్ డాలర్లకే పరిమితమవుతాయని అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం (2014-15)తో పోల్చితే 50 బిలియన్ డాలర్లు తక్కువని ఓ ప్రకటనలో పేర్కొంది. దేశీయ ఎగుమతుల్లో పెట్రోలియం ఉత్పత్తులు 28.27 శాతం పడిపోయి 1.83 బిలియన్ డాలర్లుగా, ఇంజినీరింగ్ ఉత్పత్తులు 11.22 శాతం దిగజారి 4.56 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇకపోతే ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-్ఫబ్రవరిలో ఎగుమతులు క్రిందటిసారితో చూస్తే 16.73 శాతం క్షీణించి 238.41 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో 286.3 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దిగుమతులు కూడా 14.74 శాతం తగ్గి 351.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
వాణిజ్య లోటు 113.38 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-్ఫబ్రవరిలో ఇది 126.29 బిలియన్ డాలర్లుగా ఉంది. కాగా, ఈ ఫిబ్రవరిలో చమురు దిగుమతులు 4.76 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. గత ఏడాది ఫిబ్రవరితో చూస్తే 21.92 శాతం తక్కువ. చమురేతర దిగుమతులు కూడా 0.47 శాతం పడిపోయి 22.51 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
తగ్గిన బంగారం దిగుమతులు
జనవరి నెలలో పెరిగిన బంగారం దిగుమతులు.. ఫిబ్రవరిలో 29.49 శాతం తగ్గాయి. 1.39 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఫిబ్రవరిలో 1.98 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. కరెంట్ ఖాతా లోటు పెరగడానికి కారణమైన దిగుమతుల్లో బంగారం దిగుమతులు కీలకంగా ఉన్నది తెలిసిందే. దేశీయ దిగుమతుల్లో చమురు తర్వాత అధిక వాటా కూడా పసిడిదే. కరెంట్ ఖాతా లోటు అదుపులో భాగంగా బంగారి దిగుమతులకు కళ్ళెం వేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నదీ విదితమే. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్‌లో కరెంట్ ఖాతా లోటు జిడిపిలో 6.1 బిలియన్ డాలర్లుగా ఉంటే, జూలై-సెప్టెంబర్‌లో 8.2 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇకపోతే ఈ ఫిబ్రవరిలో వాణిజ్య లోటు తక్కువ కావడానికి తగ్గిన బంగారం దిగుమతులూ ఓ కారణమే.
క్షీణించిన సేవా ఎగుమతులు
ముంబయి: భారతీయ సేవా ఎగుమతులు ఈ ఏడాది జనవరిలో 11.77 శాతం పడిపోయి 12.57 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. దిగుమతులు కూడా 12.16 శాతం తగ్గి 6.84 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మంగళవారం తెలిపింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జనవరిలో ఎగుమతులు 129.91 బిలియన్ డాలర్లుగా, దిగుమతులు 70.62 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. భారత జిడిపిలో సేవా రంగం వాటా దాదాపు 55-60 శాతంగా ఉన్నది తెలిసిందే.