బిజినెస్

జిడిపిలో కరెంట్ ఖాతా లోటు 0.7 శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత కరెంట్ ఖాతా లోటు ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) జిడిపిలో 0.7 శాతానికి పరిమితం కావచ్చని జపాన్‌కు చెందిన ఆర్థిక సేవల దిగ్గజం నొమురా బుధవారం అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం (2014-15)లో ఇది 1.3 శాతంగా నమోదైంది. దేశీయ ఎగుమతులు వరుసగా 15 నెలల నుంచి క్షీణిస్తుండగా, గత నెల ఫిబ్రవరిలోనూ గత ఏడాది ఫిబ్రవరితో పోల్చితే 5.66 శాతం పడిపోయి 20.73 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో దిగుమతులు కూడా 5.03 శాతం దిగివచ్చి 27.28 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దీంతో వాణిజ్య లోటు 6.54 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గత ఏడాది వాణిజ్య లోటు 6.74 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ క్రమంలోనే ఓ రిసెర్చ్ నోట్‌లో నొమురా ఈసారి భారత కరెంట్ ఖాతా లోటు 0.7 శాతానికి తగ్గవచ్చని చెప్పింది. దేశంలోకి విదేశీ మారకద్రవ్యం రాకపోకల సూచికే కరెంట్ ఖాతా లోటు.

డబ్ల్యుఇఎఫ్ యంగ్ గ్లోబల్ లీడర్స్‌లో
నలుగురు భారతీయులు
న్యూఢిల్లీ, మార్చి 16: ప్రపంచ ఆర్థిక మండలి (డబ్ల్యుఇఎఫ్) గుర్తించిన 121 మంది యువ విశ్వ నాయకుల జాబితాలో నలుగురు భారతీయులకు చోటు దక్కింది. యంగ్ గ్లోబల్ లీడర్స్ క్లాస్ ఆఫ్ 2016 పేరిట డబ్ల్యుఇఎఫ్ విడుదల చేసిన ఈ జాబితాలో 40 సంవత్సరాల వయసు లోపున్న 121 మందికి స్థానం లభించగా, వారిలో భారత్‌కు చెందిన బ్రమ్కో గ్రూప్ అధ్యక్షుడు కనిక దేవాన్, జిఎమ్ అసెట్ మేనేజ్‌మెంట్ సిఇఒ దివ్య సూర్యదేవర, మహారోగి సేవా సమితి సిఇఒ సీతల్ ఆమ్టే-కరజ్గీ, ఇండియా కార్బన్ డిప్యూటి మేనేజింగ్ డైరెక్టర్ శౌర్య వీర్ హిమట్సింగ్కా ఉన్నారు. ఇకపోతే ప్రాంతాలవారీగా ఆసియా-పసిఫిక్ నుంచి 15 మంది, యురేషియా నుంచి నలుగురు, యూరప్ నుంచి 23 మంది, గ్రేటర్ చైనా నుంచి 14 మంది, లాటిన్ అమెరికా నుంచి ఏడుగురు, మిడిల్-ఈస్ట్, నార్త్ ఆఫ్రికా నుంచి 11 మంది, నార్త్ అమెరికా నుంచి 24 మంది, దక్షిణాసియా నుంచి 12 మంది, సబ్-సహారన్ ఆఫ్రికా నుంచి 11 మంది జాబితాలో ఉన్నారు.
బ్రిటన్ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరూన్, అలీబాబా గ్రూప్ చీఫ్ జాక్ మా, యాహూ సిఇఒ మరిస్సా మేయర్, గూగుల్ చీఫ్ లర్రి పేజ్, ఇటలీ ప్రధాన మంత్రి మట్టెయో రెంజి గతంలో యంగ్ గ్లోబల్ లీడర్స్‌గా గుర్తింపును పొందినవారే.