బిజినెస్

దేశానికి ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఔత్సాహిక పారిశ్రామిక రంగం, ఇన్నోవేషన్ రంగాల్లో తెలంగాణ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేందుకు వీలుగా పారిశ్రామిక విధానాన్ని ఖరారు చేసినట్లు రాష్ట్ర ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. స్టార్టప్ ఎకో సిస్టమ్ అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామిక విధానాన్ని ప్రోత్సహించేందుకు నిజామాబాద్‌లో కాకతీయ శాండ్ బాక్స్ టెక్నాలజీని ఏర్పాటు చేస్తామన్నారు. స్టార్టప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ అవతరించనున్నట్లు చెప్పారు. బుధవారం ఇక్కడ సిఐఐ ఆధ్వర్యంలో తెలంగాణ భవిష్యత్తు, ఇన్నోవేషన్, ఔత్సాహిక విధానం అంశంపై జరిగిన సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్టార్టప్ టెక్నాలజీని యువత ఉపయోగించుకోవాలన్నారు. డిఆర్‌డిఎల్ డైరెక్టర్ జయరామన్ మాట్లాడుతూ రక్షణ రంగ ఉత్పత్తులకు హైదరాబాద్ హబ్‌గా తయారైందన్నారు. కాగా, తెలంగాణలో 25 లక్షల మొక్కలు నాటేందుకు వీలుగా సిఐఐ, తెలంగాణ ఐటి శాఖ మధ్య అవగాహన ఒప్పందం ఖరారైంది. ఈ సమావేశానికి సిఐఐ చైర్‌పర్సన్ వనితా దాట్ల అధ్యక్షత వహించారు.

సిఐఐ సదస్సులో జయేష్ రంజన్ తదితరులు

చివర్లో కొనుగోళ్ల మద్దతు
సెనె్సక్స్ 131, నిఫ్టీ 38 పాయింట్లు వృద్ధి

ముంబయి, మార్చి 16: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. మంగళవారం నష్టాలతో సరిపెట్టుకున్న నేపథ్యంలో బుధవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 131.31 పాయింట్లు పెరిగి 24,682.48 వద్ద నిలిచింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 38.15 పాయింట్లు కోలుకుని 7,498.75 వద్ద స్థిరపడింది. మంగళవారం సెనె్సక్స్ 253 పాయింట్లు, నిఫ్టీ 78 పా యింట్లు క్షీణించినది తెలిసిందే. నిజానికి ఉదయం ప్రారంభంలో సూచీలు నష్టాల్లోనే కదలాడాయి. అయితే చివర్లో లభించిన కొనుగోళ్ల మద్దతుతో కోలుకున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లు లాభా ల్లో ముగియటం కూడా దేశీయ మార్కెట్లకు కలిసొచ్చింది. ఆసి యా మార్కెట్లలో చైనా, దక్షిణ కొరియా, సింగపూర్, తైవాన్ సూచీలు 0.17 శాతం నుంచి 1. 02 శాతం పుంజుకోగా, హాంకాం గ్, జపాన్ సూచీలు 0.15 శాతం నుంచి 0.83 శాతం పడిపోయా యి. ఇక ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు 0.26 శాతం నుంచి 0.65 శాతం పెరిగాయి. కాగా, దేశీయ స్టాక్ మార్కెట్లలో బ్యాంకింగ్, ఐటి, ఎఫ్‌ఎమ్‌సిజి, టెక్నాలజీ, హెల్త్‌కేర్ రంగాల షేర్ల విలువ 0.88 శాతం నుంచి 0.30 శాతం పెరిగింది.
ఆర్‌ఇజిఎస్‌పిఎల్‌లోకి
ఆర్‌ఇన్‌ఫ్రా వ్యాపారాలు
న్యూఢిల్లీ, మార్చి 16: రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఆర్‌ఇన్‌ఫ్రా).. బుధవారం ముంబయి, గోవా, ఆంధ్రపద్రేశ్‌ల్లోని విద్యుదుత్పత్తి, పంపిణీ వ్యాపారాలను మరో అనుబంధ సంస్థలోకి మారుస్తున్నట్లు ప్రకటించింది. రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, రిలయన్స్ ఎలక్ట్రిక్ జనరేషన్ అండ్ సప్లై ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్‌ఇజిఎస్‌పిఎల్) మధ్య జరిగిన ఈ సర్దుబాటుకు సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం అంగీకరించిందని రిలయన్స్ ఇన్‌ఫ్రా తెలిపింది. ఇందుకుగాను తమకు ఆర్‌ఇజిఎస్‌పిఎల్ 6,282.50 కోట్ల రూపాయలు చెల్లించనుందని రిలయన్స్ ఇన్‌ఫ్రా స్పష్టం చేసింది. ఈ మేరకు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కూ వెల్లడించింది. అయతే వాటాలకు సంబంధించి ఎటు వంటి మార్పులు ఉండబోవని రెండు సంస్థలు కూడా ప్రకటించాయ.
మధ్యంతర డివిడెండ్ ప్రకటించిన టైటాన్
న్యూఢిల్లీ, మార్చి 16: టాటా గ్రూప్‌లోని వాచీల తయారీ సంస్థ టైటాన్ కంపెనీ లిమిటెడ్ బుధవారం ఈ ఆర్థిక సంవత్సరానికి (2015-16)గాను రూపాయి విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేర్‌కు 2.20 రూపాయల మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం దీన్ని ఆమోదించింది. ఈ మేరకు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు టైటాన్ తెలియజేసింది. కాగా, బుధవారం బిఎస్‌ఇ ట్రేడింగ్‌లో సంస్థ షేర్ విలువ 1.21 శాతం దిగజారి 340 రూపాయల వద్ద స్థిరపడింది.

మళ్లీ మార్కెట్‌లోకి విక్స్ యాక్షన్ 500 ఎక్స్‌ట్రా
న్యూఢిల్లీ, మార్చి 16: ఎఫ్‌ఎమ్‌సిజి సంస్థ ప్రాక్టర్ అండ్ గాంబుల్ (పిఅండ్‌జి).. తమ పాపులర్ బ్రాండ్ విక్స్ యాక్షన్ 500 ఎక్స్‌ట్రా తయారీ, విక్రయాలను మొదలుపెట్టనున్నట్లు బుధవారం తెలిపింది. ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ డ్రగ్స్ (ఎఫ్‌డిసి)ను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించడమే ఇందుకు కారణం. మంగళవారం విక్స్ యాక్షన్ 500 ఎక్స్‌ట్రా తయారీ, అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు సంస్థ ప్రకటించినది తెలిసిందే. 300లకుపైగా ఎఫ్‌డిసి ఔషధాల (పారాసిటమల్, ఫెనిలెఫ్రైన్, కఫైన్ కలిసిన) తయారీ, పంపిణీ, విక్రయాలను ప్రభుత్వం నిషేధించింది.

కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్
బ్రాండ్ విలువపై ఎస్‌ఎఫ్‌ఐఒ విచారణ
న్యూఢిల్లీ, మార్చి 16: తీవ్ర నేరాల దర్యాప్తు కార్యాలయం (ఎస్‌ఎఫ్‌ఐఒ).. విజయ్ మాల్యా నేతృత్వంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బ్రాండ్ విలువపై దృష్టి పెట్టింది. ప్రభుత్వరంగ బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయలకుపైగా బకాయిపడి విమానయాన సేవలకు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ దూరమైనది తెలిసిందే. ఈ వ్యవహారంలో మాల్యాను ఉద్దేశపూర్వక ఎగవేతదారు (విల్‌ఫుల్ డిఫాల్టర్)గా ప్రకటించిన బ్యాంకులు.. కోర్టులను కూడా ఆశ్రయించాయి. సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లు ఇప్పటికే కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా, ఇప్పటికే నిధుల మళ్లింపుపై విచారణ చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐఒ.. ఇప్పుడు బ్యాంకుల నుంచి రుణాలను పొందడంలోభాగంగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బ్రాండ్ విలువను మాల్యా 4,000 కోట్ల రూపాయలకుపైగా ఉంటుందని చూపినదానిపై దర్యాప్తు చేయనుంది. అసలు విలువపై విచారణకు సిద్ధమైంది.

అన్ని జిల్లాల్లో మినీ సిటీలు

ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో ఏర్పాటు ౄ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు

ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, మార్చి 16: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో మినీ సిటీల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. ఆయా జిల్లాల్లోని ముఖ్య నగరాలు, పట్టణాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములను ఇందుకు సిద్ధం చేస్తోంది. మినీ సిటీలను నిర్మించడానికి తగు చర్యలు తీసుకోవల్సిందిగా అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. తిరుపతి, కాకినాడ, విశాఖ నగరాలను స్మార్ట్‌సిటీలు (ఆకర్షణీయ గ్రామాలు) గా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎంపికచేసింది. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ- గుంటూరు మధ్యే రాజధాని పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టే అవకాశాలుండటంతో ఇతర జిల్లాలకు చెందిన ప్రజల నుండి అసంతృప్తి వ్యక్తమయ్యే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర విభజనకు ముందు ఆయా ప్రభుత్వాలు హైదరాబాద్ అభివృద్ధికే అధిక ప్రాధాన్యత ఇవ్వడం, విభజన అనంతరం హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో అంతర్భాగం కావడం వంటి పరిణామాలు సంభవించాయి. అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతం కావడంతో ఇతర ప్రాంతాలకు అన్యాయం జరిగిందని, హైదరాబాద్ మాత్రం అనూహ్యంగా అభివృద్ధి సాధించిందంటూ పలు జిల్లాల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే ప్రస్తుతం విజయవాడ- గుంటూరు మధ్య రాజధాని నిర్మాణ కార్యకలాపాలు జోరందుకున్న నేపథ్యంలో, ఇతర జిల్లాల్లో సైతం అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తే మంచిదన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. దీంతో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మినీ సిటీల నిర్మాణానికి భూసేకరణ చేపట్టాల్సిందిగా ఆయా జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. ఆయా జిల్లాల్లో గుర్తించిన భూముల్లో ప్రత్యేక ప్రాజెక్టులు చేపట్టడంతో పాటు గృహ నిర్మాణం, ఆర్ధికాభివృద్ధికి సంబంధించి వివిధ కార్యక్రమాలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
మేడలైన్‌లో టౌన్‌షిప్
కాగా, స్మార్ట్‌సిటీగా ఎంపికైన కాకినాడ నగరానికి చేరువలో గల మేడలైన్‌లో అందుబాటులో ఉన్న 1,100 ఎకరాల్లో టౌన్‌షిప్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. మేడలైన్‌లో టౌన్‌షిప్ నిర్మాణానికి గతంలో సింగపూర్‌కు చెందిన ఓ సంస్థ సర్వే చేసి, ప్రణాళికలు రూపొందించింది.

వలస కూలీలకు తప్పని రేషన్ కష్టాలు

చెన్నైలో ఉపాధి.. ఆంధ్రలో రేషన్

ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మార్చి 16: బతుకు బండి లాగేందుకు పిల్లాపాపలతో సుదూర ప్రాంతాలకు వలస వెళ్తున్న కూలీలను రేషన్ కష్టాలు వెంటాడుతున్నాయి. రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర నుంచి కూలీలు వేల సంఖ్యలో చెన్నైకి వలస వెళ్లారు. అయితే అక్కడికి వెళ్లిన వారు నెలనెలా రేషన్ సరుకుల కోసం సొంత ఊళ్లకు రావాల్సిన పరిస్థితి నెలకొంది. కూలీల వలసలు అరికట్టేందుకు కేంద్రం ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నా వలసలు మాత్రం ఆగడం లేదు. ఉత్తరాంధ్ర నుంచి పెద్ద ఎత్తున కూలీలు సొంత ఊరు వదిలి చెన్నైకి వలస పోతున్నారు. వలసలు నివారించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు కంటి తుడుపుగానే మిగిలిపోతున్నాయి. ఏడాది పొడవునా సొంత ఊళ్లో ఉపాధి దొరక్కపోవడం, చెన్నైలో రెట్టింపు కూలీ లభిస్తుండడంతో కూలి పనులకు అక్కడకి వెళ్తున్నట్లు వలస కూలీలు చెబుతున్నారు. చెన్నైలో భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కూలీలకు ఎక్కువ డిమాండ్ ఉండటం వలసలకు మరో కారణం అని చెప్పవచ్చు. రాష్ట్రంలో భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కూలీకి రోజుకు రూ. 250 చెల్లిస్తుండగా, చెన్నైలో రూ. 600 ఇస్తున్నారు. దీంతో ఎక్కువ మంది కూలీలు చెన్నైలో పనిమరోవైపు చెన్నైలో ఆహార భద్రత కింద అమ్మ క్యాంటిన్లు ఏర్పాటు చేయడం వల్ల అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కూలీలకు అది ఓ వరంగా మారింది. కేవలం రూ. 5 చెల్లిస్తే సరిపడా టిఫిన్ లేదా భోజనం లభించడంవల్ల అక్కడ హాయిగా జీవిస్తున్నామని ఇక్కడ నుంచి వెళ్లిన కూలీలు చెబుతున్నారు. అయతే గతంలో కుటుంబంలోని ఎవరు వెళ్లినా రేషన్ ఇవ్వగా, వలస కూలీలు తమ బంధువుల సాయంతో సరుకులు తెప్పించుకునేవారు. కానీ ప్రభుత్వం బయోమెట్రిక్ విధానం అమలు చేయడంతో కార్డులో పేర్లున్న కుటుంబ సభ్యులు తప్పనిసరిగా వేలిముద్ర వేసి సరుకులు తీసుకోవాల్సి వస్తోంది. ఇది కూలీల పాలిట అశనిపాతంగా తయారైంది. నెలనెలా రేషన్ తీసుకోకపోతే కార్డు రద్దవుతుందనే భయం వారిలో ఆందోళన కలిగిస్తొంది. దీంతో కూలీలు సొంత ఊరు రాక తప్పడం లేదు. 20 కిలోల బియ్యం కోసం వెయ్యి కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని వాపోతున్నారు. తెల్లరేషన్ కార్డుకి ఇందిరమ్మ ఇళ్లు, రేషన్, ఆరోగ్యశ్రీ వంటి సదుపాయాలను ముడిపెట్టడంతో తప్పనిసరై దూరప్రాంతం నుంచి రావాల్సి వస్తోందని అంటున్నారు. విశాఖ జిల్లా యలమంచిలి మండలానికి చెందిన వలస కూలీ పి. సన్యాసయ్య మాట్లాడుతూ కేవలం రేషన్ కోసమే కుటుంబంతోపాటు ఇక్కడకు రావాల్సి వస్తోందని వాపోయాడు.
రాష్ట్రంలో ఎక్కడైనా తీసుకోవచ్చు
అయతే వలస కూలీలు తమ సొంత ఊళ్లోనే రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారిణి శాంతకుమారి అన్నారు. చెన్నై వెళ్తున్న కూలీలు ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన తడలో రేషన్ పొందే అవకాశం ఉందన్నారు.