బిజినెస్

భారత ఆర్థిక వృద్ధిరేటును ప్రపంచం పరిహసించింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మున్ముందు మరిన్ని ఆర్థిక సంస్కరణలను అమల్లోకి తెస్తామని స్పష్టం చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ.. భారత్‌ను ‘హిందూ రేట్ ఆఫ్ గ్రోత్’గా ప్రపంచం ఎంతోకాలం పరిహసించలేకపోయిందని గుర్తుచేశారు. శుక్రవారం ఇక్కడ జరిగిన 43వ స్కాచ్ సమ్మిట్‌లో జైట్లీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘స్వాతంత్య్రం వచ్చిన దాదాపు 40 ఏళ్ల వరకు భారత్ వృద్ధిరేటు సుమారు 2-2.5 శాతం వద్ద ఉంది. దీన్ని చూసిన ప్రపంచం.. భారత ఆర్థిక వ్యవస్థను పరిహసించేది. ఈ రకమైన వృద్ధిరేటును ‘హిందూ రేట్ ఆఫ్ గ్రోత్’గా అభివర్ణించింది. మిగతా ఏ దేశాలైనాసరే ఈ స్థాయి వృద్ధిరేటును నమోదు చేస్తే హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అంటూ సంభోదించింది.’ అన్నారు. అయితే 1991 నుంచి భారత వృద్ధిరేటు పుంజుకుందని, కొన్ని సంవత్సరాల్లో 10 శాతం వృద్ధిరేటును కూడా దాటిందని గుర్తుచేశారు.
1991లో భారత్ సంస్కరణల బాట పట్టిందన్న ఆయన 20 ఏళ్లకు ముందే ఇది జరిగితే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత ముందుకెళ్లి ఉండేదన్నారు. దేశ ఆర్థిక వృద్ధిరేటు పెరగడం వల్ల మరిన్ని ఉద్యోగాలు ఏర్పడతాయని, సంపద సృష్టి జరుగుతుందని, దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారి సంఖ్య పడిపోతుందని అన్నారు.
చిత్రం స్కాచ్ సమ్మిట్‌లో ప్రసంగిస్తున్న జైట్లీ