బిజినెస్

భారతీయ స్టార్టప్‌లలో రూ. 665 కోట్ల పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 18: దేశంలో 2020 నాటికి స్టార్టప్‌లలో దాదాపు 665 కోట్ల రూపాయల (100 మిలియన్ డాలర్లు)ను పెట్టుబడిగా పెట్టనున్నట్లు అమెరికాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం సిస్కో తెలిపింది. 2.5 లక్షల మంది విద్యార్థులకూ శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పింది. శుక్రవారం సిస్కో చైర్మన్ జాన్ చాంబర్స్ ఇక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్మార్ట్ సిటీస్, సైబర్ సెక్యూరిటీ తదితర ప్రభుత్వ కార్యక్రమాల్లో సంస్థ పాత్రను మోదీకి జాన్ వివరించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గత ఏడాది 1.2 లక్షల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ కోసం 20 మిలియన్ డాలర్లను వెచ్చించేందుకు ముందుకొచ్చామని గుర్తుచేశారు. భారత్‌లో సంస్థ విస్తరణ కోసం మరో 40 మిలియన్ డాలర్లనూ ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. కాగా, గురువారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సిస్కో పలు ఒప్పందాలను కుదుర్చుకున్నది తెలిసిందే. భారత్‌లో తొలి రాష్టవ్య్రాప్త బ్రాడ్‌బాండ్ ప్రాజెక్టులో భాగంగా ఒప్పందాన్ని సిస్కో చేసుకుంది. కాగా, భారత్‌లో సిస్కో ఉద్యోగులు ప్రస్తుతం 10,000 మందికిపైగా ఉన్నారు.