బిజినెస్

రూ.1,024 కోట్లతో గోడౌన్‌ల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన పంటలను నిల్వచేసి, వాటిని తగిన ధర లభించినప్పుడు అమ్ముకునేలా రూ. 1,024 కోట్ల వ్యయంతో 335 గోడౌన్లను నిర్మించనున్నట్టు మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సోమవారం తెలంగాణ శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు ఆర్ భూపతిరెడ్డి, డి రాజేశ్వర్‌రావు, సభావత్ రాములు నాయక్, బోడకంటి వెంకటేశ్వర్లు నూతన మార్కెట్ యార్డుల ఏర్పాటు విషయంపై అడిగిన ప్రశ్నకు మంత్రి సమధానమిచ్చారు. రాష్ట్రంలో 179 ప్రధాన మార్కెట్ యార్డులు, 96 ఉప మార్కెట్ యార్డులున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రైతుల సౌకర్యార్థం ప్రస్తుతమున్న వ్యవసాయ మార్కెట్‌లను విభజిస్తూ 30 నూతన వ్యవసాయ మార్కెట్‌లను ఏర్పాటు చేశామని, వీటిలో 24 కమిటీల ఏర్పాటు పూర్తయిందని, మరో ఆరు కమిటీలను త్వరలో నియమిస్తామని మంత్రి వెల్లడించారు. వ్యవసాయ కమిటీల చైర్మన్ పదవిలో రిజర్వేషన్‌ల అధారంగా నియమించడం జరుగుతుందన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌ను నామినేట్ చేయడానికి ఎస్‌టిలకు 6 శాతం, ఎస్‌సిలకు 15, బిసిలకు 29 శాతం రిజర్వేషన్‌ను అమలు చేస్తున్నామన్నారు.