బిజినెస్

పావు శాతం వడ్డీరేట్ల కోతకు అవకాశం: డ్యూషే బ్యాంక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కీలక వడ్డీరేట్లను తగ్గించాలంటూ వస్తున్న డిమాండ్లను రాబోయే ద్రవ్యసమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) పరిశీలించే అవకాశాలున్నాయని, దీంతో రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లు పావు శాతం చొప్పున దిగివచ్చే వీలుందని డ్యూషే బ్యాంక్ సోమవారం ఓ నివేదికలో అంచనా వేసింది. గత నెల ఫిబ్రవరిలో వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఇంకా మైనస్‌లోనే ఉండటం, పారిశ్రామికోత్పత్తి సూచీ క్షీణించడం వంటివి వడ్డీరేట్ల కోతకు అవకాశం కల్పిస్తోందని పేర్కొంది.
2016-17 జిడిపి వృద్ధి 7.7 శాతం
ఐసిఆర్‌ఎ అంచనా
న్యూఢిల్లీ, మార్చి 21: వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17)లో దేశ జిడిపి వృద్ధిరేటు 7.7 శాతానికి పెరగవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఐసిఆర్‌ఎ అంచనా వేసింది. 7వ వేతన సంఘం అమలు, వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఒఆర్‌ఒపి) సిఫార్సులతో పెరిగే దేశీయ వినియోగ సామర్థ్యం మధ్య జిడిపి వృద్ధిరేటు పుంజుకోగలదన్న అభిప్రాయాన్ని ఐసిఆర్‌ఎ సోమవారం వ్యక్తం చేసింది. భారత స్థూల ఆర్థిక పరిస్థితులపై స్పందించిన ఐసిఆర్‌ఎ.. గ్రామీణ ప్రాంతాల్లో పెరిగే వినియోగం దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో బలం చేకూర్చగలదంది.
ఉత్పాదక సామర్థ్యం రెట్టింపుపై
గాయత్రీ పవర్ దృష్టి
హైదరాబాద్, మార్చి 21: ఆంధ్రప్రదేశ్‌లోని థర్మల్ పవర్ ప్రాజెక్టుల ఉత్పాదక సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలనుకుంటున్నట్లు సెంబ్‌కార్ప్ గాయత్రీ పవర్ కాంప్లెక్స్ తెలిపింది. కృష్ణపట్నం వద్ద 2,640 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుదుత్పాదక ప్లాంట్లను సంస్థ కలిగి ఉంది. ఈ క్రమంలో రాబోయే ఐదేళ్లలో ఉ త్పాదక సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని భావిస్తున్నామని ఇందుకు రూ. 10- 12,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నామని గాయత్రీ ప్రాజెక్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ టివి సందీప్‌కుమార్ రెడ్డి సోమవారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు.