బిజినెస్

హైదరాబాద్‌లో టెక్ మహీంద్ర మెగా జాబ్ ఫెయిర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్‌లో సరళ్ రోజ్‌గార్ పథకంలో భాగంగా సోమవారం టెక్ మహీంద్ర మెగా జాబ్ ఫెయిర్ నిర్వహించింది. ఈ మెగా జాబ్ ఫెయిర్‌లో ఆటోమోటివ్, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్, లాజిస్టిక్స్, ఎడ్యుకేషన్, ఎఫ్‌ఎంసిడి రంగాల నుంచి 15 సంస్థలు పాల్గొన్నాయి. వీటిలో ఉద్యోగాల కోసం సుమారు 300 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టెక్ మహీంద్ర బిజినెస్ ఎగ్జిక్యూటివ్ హెడ్ మయూర్‌దాస్ గుప్తా మాట్లాడుతూ జాబ్ ఫెయిర్‌కు మంచి స్పందన లభించిందన్నారు. హైదరాబాద్ నగరం తమ సంస్థకు వ్యూహాత్మక లేబర్ మార్కెట్‌గా నిలుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు అనుకూలమైన ప్రాంతంగా నిలుస్తోందన్నారు. ఇప్పటికే తెలంగాణలోని ఐదు జిల్లాల్లో తమ ఉనికిని చాటుకున్నామని, భవిష్యత్‌లో మరింతగా విస్తరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 80 ఉద్యోగ విభాగాలలో 90 వేల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారని, ఇక్కడ ప్రధానంగా ఉద్యోగ విభాగాల్లో సేల్స్ ప్రమోటర్స్, రిటైల్ అసిస్టెంట్, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్, డ్రైవర్, ఎలక్ట్రిషియన్, కార్పెంటర్, మెషీన్ ఆపరేటర్, టైలర్స్, కుట్టు మిషన్ ఆపరేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్, సెక్యూరిటీ గార్డ్స్, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌కు డిమాండ్ ఉందని దాస్‌గుప్తా తెలిపారు.
15 ఎఫ్‌డిఐలకు
ఎఫ్‌ఐపిబి ఆమోదం
న్యూఢిల్లీ, మార్చి 21: విదేశీ పెట్టుబడుల ప్రగతి బోర్డు (ఎఫ్‌ఐపిబి) 7,261.6 కోట్ల రూపాయల విలువైన 15 సంస్థల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ సంస్థల్లో నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా ఎఐఎ లైఫ్ ఇన్సూరెన్స్, బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్, అవివా లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థల ఎఫ్‌డిఐ ప్రతిపాదనల విలువే 6,924 కోట్ల రూపాయలుగా ఉంది.
ఈ నెల 7న జరిగిన సమావేశంలో ఈ 15 సంస్థల ఎఫ్‌డిఐలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఎఫ్‌ఐపిబి సిఫార్సు చేయగా, దానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా అంగీకారం తెలిపింది. అలాగే 6,885 కోట్ల రూపాయల విలువైన ఓ ఎఫ్‌డిఐ ప్రతిపాదనను సిసిఇఎ ఆమోదం కోసం ఎఫ్‌ఐపిబి సిఫార్సు చేసింది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి నేతృత్వంలోని ఎఫ్‌ఐపిబి అనేది ఓ ఇంటర్-మినిస్టీరియల్ ప్యానెల్. ఇది 5,000 కోట్ల రూపాయల వరకున్న విదేశీ పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతుంది.