బిజినెస్

25 వేల ఖాళీలను భర్తీ చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 20 వేల నుండి 25 వేల ఉద్యోగాల భర్తీని చేపట్టాలని నిర్ణయించినట్టు రాష్ట్ర ఉపాధి కల్పన, కార్మిక మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. శాసనమండలిలో సోమవారం 311 నిబంధన కింద ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులు రెడ్డి ఇచ్చిన నోటీసుకు మంత్రి సమాధానం చెబుతూ, రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం అనేక సమస్యలను ఎదుర్కొంటోందన్నారు. గత రెండు బడ్జెట్‌లలోనూ రెవెన్యూ లోటు వల్ల ఆర్థికపరమైన ఇక్కట్లు ఎదురయ్యాయని, రెవెన్యూ లోటును తగ్గించేందుకు తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నదని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి కొద్దికొద్దిగా మెరుగవుతుండటం వల్ల ఉద్యోగాల భర్తీపై దృష్టి కేంద్రీకరించామన్నారు. ప్రభు త్వ శాఖల్లో మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయో పరిశీలిస్తున్నామని, ప్రాథమిక సమాచారం ప్రకారం అందిన వివరాలను పరిశీలించిన తర్వాత మొదటి విడతలో 20 వేల నుండి 25 వేల ఖాళీలను భర్తీ చేయలని నిర్ణయించామన్నారు. త్వరలో భర్తీ ప్రక్రియ మొదలవుతుందని మంత్రి అచ్చెన్నాయుడు సభకు వివరించారు.