బిజినెస్

ఇప్పుడేం చేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికిని మొండి బకాయిలు ప్రశ్నార్థకం చేస్తున్న నేపథ్యంలో రుణాల వసూళ్లపై బ్యాంకర్లతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం ఇక్కడ సమీక్ష నిర్వహించింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బకాయిల వ్యవహారాన్ని ఆరా తీసింది. కాగా, ఈ సమీక్ష ఎప్పుడూ జరిగేదేనని, అయితే రుణాల వసూళ్లకు సంబంధించి చర్యలను ముమ్మరం చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఈ సందర్భంగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మొండి బకాయి వ్యవహారం చర్చకు వచ్చిందా? అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ మొండి బకాయిలన్నింటినీ సమీక్షించినట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వరంగ బ్యాంకుల పద్దుల చిట్టాను క్లీన్ చేయడంలో భాగంగానే తాజా సమీక్ష జరిగింది. మొండి బకాయిలపై కఠినంగా వ్యవహరించాలని ఇప్పటికే బ్యాంకులకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేసినది తెలిసిందే. రుణాలను వసూలు చేయడానికి పూచీకత్తుగా పెట్టిన ఆస్తులను వెంటనే అమ్మేయాలని కూడా ఇటీవల ఆర్థిక మంత్రిత్వ శాఖ బ్యాంకులకు సూచించింది. ఈ క్రమంలో తాజా సమీక్షలో మరోసారి ఉద్దేశపూర్వక ఎగవేతదారుల నుంచి రుణాల వసూళ్లకు ప్రభావవంతమైన చర్యలు చేపట్టాలని బ్యాంకర్లకు ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. గత ఏడాది డిసెంబర్ ఆఖరుకల్లా ప్రభుత్వరంగ బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తుల విలువ 3.61 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. ఇదే సమయంలో ప్రైవేట్‌రంగ బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తుల విలువ 39,859 కోట్ల రూపాయలుగా మాత్రమే ఉండటం గమనార్హం. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మొండి బకాయిలుగా మారనున్న రుణాలు 7.30 శాతంగా ఉంటే, ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో ఇది 2.36 శాతంగా ఉంది. ఇక ప్రభుత్వరంగ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నవారిలో ఉద్దేశపూర్వక ఎగవేతదారులు దాదాపు 7,686 మంది ఉండగా, వీరు తీసుకున్న రుణాల విలువ 66,190 కోట్ల రూపాయలుగా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటిదాకా 6,816 దావాలు నమోదైతే, 1,669 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.