బిజినెస్

బంద్‌పై నగల వ్యాపారుల్లో చీలిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ముంబయి: బంగారు ఆభరణాలపై ఒక శాతం ఎక్సైజ్ సుంకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్న నగల వర్తకుల మధ్య సమ్మె విరమణ విషయంలో బేధాభిప్రాయాలు చోటుచేసుకున్నాయి. సగానికిపైగా ఆభరణాల వ్యాపారులు సమ్మెను కొనసాగిస్తుండగా, మిగతావారు తమ ఆందోళనను విరమించారు. ‘ఇన్‌స్పెక్టర్ రాజ్’ ఉండబోదని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో శనివారం రాత్రి అఖిల భారత రత్నాలు, ఆభరణాల వాణిజ్య సమాఖ్య (జిజెఎఫ్), అఖిల భారత బులియన్, ఆభరణాల సంఘం (ఐబిజెఎ), రత్నాలు, ఆభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి (జిజెఇపిసి) సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించాయి. అయితే ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ల్లోని వర్తకులు మాత్రం సమ్మెను కొనసాగిస్తున్నారు. ఎక్సైజ్ సుంకాన్ని విధించబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసేంతవరకు బంద్ ఆగదని తేల్చిచెబుతున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గత నెల ఫిబ్రవరి 29న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సాధారణ వార్షిక బడ్జెట్‌లో బంగారు ఆభరణాలపై ఒక శాతం ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రతిపాదించినది తెలిసిందే. దీంతో దీన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 2 నుంచి దేశవ్యాప్తంగా నగల వ్యాపారులు బంద్ చేపట్టారు. ఇప్పటికే 80,000 కోట్ల రూపాయలకుపైగా నష్టం వాటిల్లిందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో ఇంకా కొనసాగడం మంచిది కాదని, ప్రభుత్వం ఈ విషయంలో కొంత దిగివచ్చినందున సంయమనం అవసరమని బంద్‌ను నిలిపివేసినవారు అంటున్నారు.
కమిటీ ఏర్పాటు
మరోవైపు నగల వ్యాపారుల డిమాండ్లపై మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అశోక్ లహ్రీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. 60 రోజుల్లో ఈ కమిటీ తమ నివేదికను సమర్పించనుంది. బంగారు ఆభరణాలపై ఒక శాతం ఎక్సైజ్ సుంకంతోపాటు కొనుగోళ్లకు పాన్ కార్డును తప్పనిసరి చేయడం వంటి డిమాండ్లు వర్తకుల నుంచి ప్రధానంగా ఉన్నాయి.

సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో ఆభరణాల వర్తకుల ఆందోళన