క్రీడాభూమి

ఆసీస్‌పై కివీస్ పంజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్: మహిళల టి-20 వరల్డ్ కప్‌లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్ మరో 22 బంతులు మిగిలి ఉండగానే, ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్పిన్నర్ లీ కాస్పెరెక్ అద్భుత బౌలింగ్ నైపుణ్యం న్యూజిలాండ్‌ను గెలిపించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ విఫలంకాగా, మిడిల్ ఆర్డర్‌లో బ్యాట్స్‌విమెన్ కొంత వరకు నిలదొక్కుకోవడంతో ఆసీస్ కోలుకుం. ఎలిస్ పెర్సీ 42, జెస్ జొహాన్సన్ 23, బెత్ రూనీ 15 (నాటౌట్) పరుగులు సాధించారు. కాస్పెరెక్ 13 పరుగులకే మూడు వికెట్లు కూల్చి ఆసీస్ ఇన్నింగ్స్‌ను దారుణంగా దెబ్బతీసింది. ఎరిన్ బర్మింహామ్ 23 పరుగులిచ్చి రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకుంది.
ఆసీస్‌ను ఓడించేడానికి 104 పరుగులు చేసేందుకు ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్ 16.2 ఓవర్లలో నాలుగు వికెట్లు చేజార్చుకొని, లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ సూజీ బేట్స్ 23 పరుగులు చేయగా, రాచెల్ ప్రీస్ట్ 34, సోఫీ డివైన్ 17 పరుగులతో రాణించారు. చివరిలో అమీ సాల్టర్‌వెయిట్ 16 పరుగులతో నాటౌట్‌గా నిలిచి కివీస్‌ను విజయపథంలో నడిపించింది.