బిజినెస్

ఎడెల్‌వీస్ చేతికి జెపి మోర్గాన్ ఎమ్‌ఎఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: జెపి మోర్గాన్స్ మ్యూచువల్ ఫండ్ (ఎమ్‌ఎఫ్) భారతీయ వ్యాపారాన్ని కొనుగోలు చేస్తున్నట్లు మంగళవారం ఎడెల్‌వీస్ అసెట్ మేనేజ్‌మెంట్ ప్రకటించింది. వ్యాపారపరంగా ఎడెల్‌వీస్‌కు జెపి మోర్గాన్ ఎమ్‌ఎఫ్ ప్రధాన ప్రత్యర్థిగా కొనసాగుతోంది. ఈ క్రమంలో జెపి మోర్గాన్ భారత మ్యూచువల్ ఫండ్ వ్యాపారాన్ని ఎడెల్‌వీస్ హస్తగతం చేసుకుంటుండగా, ఈ లావాదేవీల విలువను ఇరు సంస్థలు వెల్లడించలేదు. అయితే డీల్ విలువ దాదాపు 110 కోట్ల రూపాయలుగా ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా, జెపి మోర్గాన్ మ్యూచువల్ ఫండ్స్ 7,000 కోట్ల రూపాయలకుపైగా ఆస్తులను నిర్వహిస్తోంది. జెపి మోర్గాన్ ఎఎమ్‌సి ఇండియా నిర్వహిస్తున్న అన్ని ఆన్‌షోర్ ఫండ్ స్కీమ్‌లు ఇకపై ఎడెల్‌వీస్‌కు చెందనున్నాయి. దేశీయ ఆన్‌షోర్ మ్యూచువల్ ఫండ్ వ్యాపారంతోపాటు అంతర్జాతీయ ఫండ్స్ నిధి కూడా ఎడెల్‌వీస్ చేతికి రానుంది. ఈ లావాదేవీలు రాబోయే 4-6 నెలల్లో పూర్తి కావచ్చని ఎడెల్‌వీస్ గ్రూప్ సిఇఒ (గ్లోబల్ అసెట్స్ అండ్ వెల్త్ మేనేజ్‌మెంట్) నితిన్ జైన్ తెలిపారు. జెపి మోర్గాన్‌లోని ఉద్యోగుల్లో అధికులను ఎడెల్‌వీస్ తీసుకుంటుందని కూడా తెలుస్తోంది. ఈ లావాదేవీల అనంతరం ఎడెల్‌వీస్ నిర్వహణలోని ఆస్తుల విలువ 8,757 కోట్ల రూపాయలకు చేరనుంది. నిజానికి జెపి మోర్గాన్ ఎమ్‌ఎఫ్‌ను చేజిక్కించుకోవడానికి టాటా ఎఎమ్‌సి, రిలయన్స్ ఎమ్‌ఎఫ్ తదితర సంస్థలు పోటీపడ్డాయి. 2007లో భారతీయ మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారంలోకి జెపి మోర్గాన్ ప్రవేశించగా, గత ఏడాది ఎదురైన కొన్ని సమస్యలతో తాజా నిర్ణయానికి వచ్చేసింది. ఇక గత ఏడాది గోల్డ్‌మన్స్ సాచ్స్ ఇండియా ఎఎమ్‌సి వ్యాపారాన్ని రిలయన్స్ క్యాపిటల్ 243 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. గోల్డ్‌మన్ సాచ్స్ నిర్వహణలో 7,132 కోట్ల రూపాయల ఆస్తులుండేవి. ఇదిలావుంటే 2008 నుంచి అంతర్జాతీయ సంస్థలు మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారం నుంచి భారీ స్థాయిలోనే వైదొలుగుతున్నాయి. 2008లో ఐడిఎఫ్‌సికి స్టాండర్డ్ చార్టర్డ్ ఇండియా ఎఎమ్‌సి తమ వ్యాపారాన్ని అమ్మేయగా, 2012లో ఎల్‌అండ్‌టి ఫైనాన్స్‌కు ఫిడెలిటి మ్యూచువల్ ఫండ్ తమ వ్యాపారాన్ని విక్రయించింది. అలాగే 2013లో మోర్గాన్ స్టాన్లీ ఫండ్ వ్యాపారాన్ని హెచ్‌డిఎఫ్‌సి ఎమ్‌ఎఫ్ దక్కించుకుంది. ఇదే ఏడాది జపాన్‌కు చెందిన దైవా ఎఎమ్‌సిని ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐకి చెందిన మ్యూచువల్ ఫండ్ విభాగం సొంతం చేసుకుంది. మొత్తంగా గడచిన ఎనిమిదేళ్లలో జెపి మోర్గాన్ ఎమ్‌ఎఫ్‌తో కలుపుకుని 11 సంస్థలు భారతీయ మ్యూచువల్ ఫండ్స్ వ్యాపా రం నుంచి వైదొలిగాయి. అయినప్పటికీ ఇంకా దేశంలో 40కిపైగా మ్యూచువల్ ఫండ్ సంస్థలుండగా, వీటి నిర్వహణలో 13 లక్షల కోట్ల రూపాయలకుపైగా ఆస్తులున్నాయి.