బిజినెస్

పావు శాతం వడ్డీరేట్ల కోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వచ్చే నెల 5న జరిపే ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లను పావు శాతం తగ్గించవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ అంచనా వేసింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17) మొత్తంగా అర శాతం మాత్రం వడ్డీరేట్లను ఆర్‌బిఐ తగ్గించవచ్చని అభిప్రాయపడింది. మంగళవారం ఓ నివేదికలో ఆర్‌బిఐ ద్రవ్యసమీక్షపై తన అంచనాలను వెల్లడించింది.
ఫిబ్రవరి నెలకుగాను విడుదలైన రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు దిగిరావడం, హోల్‌సేల్ ద్రవ్యోల్బణం వరుసగా 16వ నెల మైనస్‌లోనే ఉండటం, పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపి) గణాంకాలు పతనమవడం, ఎగుమతులు కోలుకోలేకపోవడం మధ్య రాబోయే ద్రవ్యసమీక్షలో ఆర్‌బిఐ రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గించవచ్చని చెప్పింది. కాగా, కీలక వడ్డీరేట్లను తగ్గించాలంటూ వస్తున్న డిమాండ్లను రాబోయే ద్రవ్యసమీక్షలో ఆర్‌బిఐ పరిశీలించే అవకాశాలున్నాయని, దీంతో రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లు పావు శాతం చొప్పున దిగివచ్చే వీలుందని డ్యూషే బ్యాంక్ కూడా సోమవారం ఓ నివేదికలో అంచనా వేసినది తెలిసిందే.

వరుస లాభాల్లో
దేశీయ స్టాక్ మార్కెట్లు

ముంబయి, మార్చి 22: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో నడుస్తున్నాయి. గత రెండు రోజుల లాభాలను కొనసాగిస్తూ మంగళవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 45.12 పాయింట్లు పుంజుకుని 25,330.49 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 10.65 పాయింట్లు పెరిగి 7,714.90 వద్ద నిలిచింది. విదేశీ మదుపరుల నుంచి పెట్టుబడుల వెల్లువ, రాబోయే ద్రవ్యసమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఈ క్రమంలోనే రియల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, విద్యుత్, క్యాపిటల్ గూడ్స్, ఆటో రంగాల షేర్ల విలువ 2.68 శాతం నుంచి 1.08 శాతం పెరిగింది. ఆసియా మార్కెట్లలో జపాన్ 1.94 శాతం లాభపడగా, హాంకాంగ్ 0.08 శాతం నష్టపోయింది. బ్రస్సెల్స్ పేలుళ్ల ఘటనతో ఐరోపా మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. సోమవారం సెనె్సక్స్ 333 పాయంట్లు, నిఫ్టీ 100 పాయంట్లు లాభపడినది తెలిసిందే. అంతకుముందు శుక్రవారం కూడా స్టాక్ మార్కెట్లు లాభాల్లోనే కదలాడాయ.

టాప్-30 గ్లోబల్ సిఇఒల్లో
ఆనంద్ మహీంద్ర, ఆదిత్యా పురి

న్యూఢిల్లీ, మార్చి 22: భారతీయ కార్పొరేట్ దిగ్గజాలు ఆనంద్ మహీంద్ర, ఆదిత్యా పురి టాప్-30 గ్లోబల్ సిఇఒల జాబితాలో నిలిచారు. ప్రపంచ అత్యుత్తమ 30 మంది సిఇఒలకు సంబంధించి బారోన్స్ తాజాగా విడుదల చేసిన 12వ వార్షిక జాబితాలో అమెజాన్, జెపిమోర్గాన్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ, ఆల్ఫాబెట్, గూగుల్, అడోబ్, ఫేస్‌బుక్, స్టార్‌బక్స్, బార్క్‌షైర్ హాథవే, హనీవెల్ ఇంటర్నేషనల్ తదితర సంస్థల సిఇఒలున్నారు. ఈసారి జాబితాలో 9 మంది కొత్తవారికి స్థానం దక్కింది. భారత్ నుంచి మహీంద్ర అండ్ మహీంద్ర మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ మహీంద్ర, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్యా పురి ఉండగా, ప్రవాస భారతీయుడు, అడోబ్ సిస్టమ్స్ సిఇఒ శంతను నారాయణ్ కూడా ఉన్నారు. లర్రి పేజ్, వారెన్ బఫెట్, మార్క్ జూకర్‌బర్గ్‌లు జాబితాలో ఉన్నారు.