బిజినెస్

పుష్కరాల నాటికి విమానాశ్రయం విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: గన్నవరం విమానాశ్రయంలో దాదాపు రూ. 120 కోట్లతో చేపట్టిన సరికొత్త టెర్మినల్ కృష్ణా పుష్కరాల నాటికి వినియోగంలోకి వస్తుందని ఎయిర్‌పోర్టు డైరక్టర్ జి మధుసూదనరావు తెలిపారు. విమానాలను నిలిపేందుకు మరో పది పార్కింగ్ బేలు సిద్ధమవుతున్నాయని, ఇప్పటివరకు విఐపిల విమానాలు వచ్చినప్పుడు పార్కింగ్ కోసం ఇతర ప్రాంతాలకు పంపించాల్సి వస్తోందన్నారు. కాగా, గన్నవరం నుంచి కార్గో విమాన సర్వీసులకు తగిన డిమాండ్ ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. కొత్త టెర్మినల్ పూర్తిగా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ప్రధానంగా నిర్మాణం జరుగుతున్నదని ఇందుకోసం 980 టన్నుల ఫ్రేమ్స్ విదేశాల నుంచి తెప్పించామన్నారు. అయతే అంతర్జాతీయ విమానాశ్రయంగా రూపుదిద్దుకునేందుకు ఇప్పట్లో అవకాశాలు లేవన్నారు. ఇందుకోసం ముందుగా 1,200 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందన్నారు. తొలి దశలో ప్రస్తుతం ఉన్న 2,257 మీటర్ల రన్‌వేను 3,025 మీటర్లకు పొడిగించేందుకు మరో రెండేళ్ల సమయం పట్టగలదన్నారు. ఇందుకోసం భూసేకరణ పూర్తయి ఏలూరు కాల్వను మళ్లించాల్సి ఉందన్న ఆయన అంతర్జాతీయ విమాన సర్వీసులు నడిపేందుకు ఇప్పటివరకు ఏ సంస్థ ముందుకు రాలేదని చెప్పారు. ఒకవేళ ఎయిర్‌లైన్స్ ముందుకు వస్తే రెండు మాసాల్లో రాత్రి 9.30 తర్వాత విమానాలు నిలిచేలా ఏర్పాట్లు చేయగలమన్నారు. ముందుగా కస్టమ్స్ అధికారులు చెకింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉందన్నారు. గన్నవరం నుంచి కడప, తిరుపతి నగరాలకు వారంలో మూడు రోజులపాటు ప్రత్యేక సర్వీస్‌లు నడిపేందుకు ట్రూ జెట్ సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుందని, నిర్ణీత సీట్లు భర్తీ కాని పక్షంలో ప్రభుత్వమే నష్టపరిహారం ఇవ్వగలదన్నారు. కాగా, కోల్డ్ స్టోరేజీ యజమానుల సంఘ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు కార్గో విమాన సర్వీసులను నడపాలని కోరగా కార్గో సర్వీసులకు డి మాండ్ ఉన్న మాట వాస్తవమేనని, ప్రస్తుతానికి ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

గన్నవరం ఎయిర్‌పోర్టు (ఫైల్ ఫొటో)