బిజినెస్

రూ. 4 వేల కోట్ల బాకీ తీరుస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 30: ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారు అపవాదును ఎదుర్కొంటున్న లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా.. ఆయన నేతృత్వంలోని ప్రైవేట్‌రంగ విమానయాన సంస్థ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్ బ్యాంకులకు 4,000 కోట్ల రూపాయలను చెల్లిస్తామని బుధవారం ప్రతిపాదించాయి. సుప్రీం కోర్టుకు సమర్పించిన ఓ సీల్డ్ కవర్‌లో ‘ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ నేతృత్వంలోని 17 బ్యాంకుల కూటమికి తాము ఇవ్వాల్సిన 6903 కోట్ల రూపాయల రుణాల్లో ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 4,000 కోట్ల రూపాయల రుణాన్ని చెల్లిస్తాం.’ అంటూ మాల్యా, కింగ్‌ఫిషర్‌తోపాటు యునైటెడ్ బ్రూవరీస్ (హోల్డింగ్స్) లిమిటెడ్, కింగ్‌ఫిషర్ ఫినె్వస్ట్ (ఇండియా) లిమిటెడ్ స్పష్టం చేశాయి. దీంతో ఈ ప్రతిపాదనపై స్పందించేందుకు బ్యాంకుల కూటమికి వారం రోజుల గడువునిస్తూ ఈ కేసును తదుపరి విచారణ నిమిత్తం వచ్చే నెల 7కు వాయిదా వేసింది జస్టిస్ కురియన్ జోసెఫ్, ఆర్‌ఎఫ్ నారీమన్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం. కింగ్‌ఫిషర్, మాల్యా తరఫున సీనియర్ న్యాయవాది సిఎస్ వైద్యనాథన్ వాదిస్తుండగా, బ్యాంకుల కూటమికి ఓ ప్రతిపాదన చేసినట్లు ఆయన తెలిపారు. ఆ ప్రతిపాదనను బ్యాంకుల కూటమికి అందజేసినట్లు కూడా ఆయన బుధవారం ఇక్కడ స్పష్టం చేశారు. కాగా, వివిధ బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయలకుపైగా బకాయిపడి, వాటిని ఉద్దేశపూర్వకంగానే చెల్లించడం లేదన్న ఆరోపణలెదుర్కొంటున్న మాల్యా.. కొద్ది రోజుల క్రితమే దేశం విడిచి వెళ్లిపోయారని ఈ నెల 9న సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలియజేసినది తెలిసిందే. ఇదిలావుంటే సంప్రదింపులు జరుగుతున్నందున, మీడియాలో ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున కథనాలు వస్తున్న నేపథ్యంలో తమ ప్రతిపాదనను సీల్డ్ కవర్‌లోనే ఉంచాలని ధర్మాసనానికి మాల్యా తరఫు న్యాయవాది వైద్యనాథన్ విజ్ఞప్తి చేశారు.
ప్రతిపాదనలు అందాయి: ఎస్‌బిఐ
ముంబయి: మాల్యా, కింగ్‌ఫిషర్ చేసిన ప్రతిపాదనలు తమకు అందాయని రుణాలిచ్చిన బ్యాంకర్లు స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదనను తాము పరిశీలించనున్నట్లు బ్యాంకుల కూటమికి నేతృత్వం వహిస్తున్న ఎస్‌బిఐ తెలిపింది. కూటమిలోని ఇతర సభ్యులతో చర్చలు జరిపి ఓ నిర్ణయాన్ని వెల్లడిస్తామని పేర్కొంది. మాల్యా, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు 7,800 కోట్ల రూపాయల రుణాన్ని ఇచ్చామని ఎస్‌బిఐసహా 17 బ్యాంకులు చెబుతున్నాయి. ఈ బ్యాంకర్లలో పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ బ్యాంక్, యూకో బ్యాంక్, దేనా బ్యాంక్ తదితర బ్యాంకులున్నాయి. గత ఏడాది మాల్యాను ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుగా ఎస్‌బిఐ ప్రకటిస్తే, గత నెల పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రకటించినది తెలిసిందే.
భారీ లాభాల్లో యుబి గ్రూప్ షేర్లు
మరోవైపు బ్యాంకులకు మాల్యా, కింగ్‌ఫిషర్ చేసిన తాజా ప్రతిపాదనల నేపథ్యంలో బుధవారం యునైటెడ్ బ్రూవరీస్ (హోల్డింగ్స్) లిమిటెడ్ (యుబిహెచ్‌ఎల్) నేతృత్వంలోని యుబి గ్రూప్ షేర్ల విలువ 12 శాతానికిపైగా ఎగబాకడం గమనార్హం. మెక్‌డౌల్ హోల్డింగ్స్ 4.36 శాతం, మంగళూరు కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ 1.82 శాతం, యునైటెడ్ బ్రూవరీస్ షేర్ల విలువ 0.21 శాతం చొప్పున పెరిగాయి. మొత్తంగా బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో యుబిహెచ్‌ఎల్ షేర్ విలువ 12.20 శాతం పెరిగి 20.70 రూపాయల వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో 21.35 రూపాయల గరిష్ఠ స్థాయిని తాకింది.