బిజినెస్

గోదావరి జిల్లాల పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మార్చి 30: ఎల్లలులేని అభివృద్ధికి అవకాశమున్న పర్యాటక రంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. విశాలమైన సముద్ర తీరంతోపాటు గోదావరి నది పరీవాహక తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాయి. ఇందులోభాగంగానే ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యాటకాభివృద్ధికి చేపట్టనున్న కార్యక్రమాలపై సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డిపిఆర్) సిద్ధం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పర్యాటక శాఖాధికారులు సమర్పించనున్నారు. ఈ మేరకు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించి, అవసరమైన ప్రతిపాదనలను ప్రత్యేక కన్సల్టెంట్ల బృందం తయారు చేసింది. కేంద్ర ప్రభుత్వం నియమించిన ఈ బృందం సిద్ధం చేసిన డిపిఆర్‌ను కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖలు ఆమోదించిన పక్షంలో ఆ మేరకు పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలు మొదలవుతాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో గత మూడు రోజులుగా వివిధ ప్రాంతాల్లో కన్సల్టెంట్ల బృందం ప్రతినిధులు పర్యటించారు. రివర్ సర్క్యూట్ పేరుతో అభివృద్ధి చేయనున్న ఈ ప్రత్యేక ప్రాజెక్టుపై వారు నిర్వహించిన సర్వేలో ప్రపంచ స్థాయి ప్రమాణాలకు తీసిపోని రీతిలో ఉభయ గోదావరి జిల్లాల్లో టూరిజం కేంద్రాల అభివృద్ధికి అవకాశం ఉన్నట్టు ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కొల్లేరు సర్క్యూట్, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎకో టూరిజం కింద అభివృద్ధి చేయనున్న పర్యాటక కేంద్రాలు, జొన్నాడ, యానాం ప్రాంతాల్లో పలు పర్యాటక కేంద్రాలను కన్సల్టెంట్లు ఎంపిక చేశారు. వీటిపై డిపిఆర్ సిద్ధం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయా జిల్లాల అధికారుల ద్వారా నివేదిస్తారు. అన్నపూర్ణ అసోసియేట్స్ (హైదరాబాద్), ఆర్ కాప్ అండ్ అసోసియేట్స్ (్ఢల్లీ), సిరాజ్ అండ్ రేణు (హైదరాబాద్), కిట్‌కో కంపెనీ (కొచ్చిన్), స్ట్యాటెక్ (అహ్మదాబాద్), ఇన్‌ఫినిటీ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండియా-హైదరాబాద్, బికెటి అసోసియేట్స్-హైదరాబాద్, స్పేస్ గ్రూప్‌లకు చెందిన కన్సల్టెంట్ల బృందం ఈ డిటైల్డ్ ప్రాజెక్ట్ నివేదికను రూపొందించింది.