బిజినెస్

ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 2.50 లక్షల కోట్లు అధిగమించిన ఎస్‌బిహెచ్ వ్యాపారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 30: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బిహెచ్) ఈ ఆర్థిక సంవత్సరం (2015-16)లో 2.50 లక్షల కోట్ల రూపాయల వ్యాపారాన్ని అధిగమించింది. గురువారంతో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను సంబంధించిన బ్యాంక్ వ్యాపార లావాదేవీలను బుధవారం ఇక్కడ ఎస్‌బిహెచ్ మేనేజింగ్ డైరెక్టర్ శంతను ముఖర్జీ వెల్లడించారు. 2015-16లో బ్యాంక్ వ్యాపారం దాదాపు 2.55 లక్షల కోట్ల రూపాయలుగా ఉండొచ్చని అంచనా వేశారు. డిపాజిట్లు 1.36-1.38 లక్షల కోట్ల రూపాయలుగా, అడ్వాన్సులు 1.14-1.16 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నాయని వివరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17)లో 20 శాతం వ్యాపార వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖర్జీ తెలిపారు. కాగా, ఏప్రిల్ 3న ఎస్‌బిహెచ్ ప్లాటినమ్ జూబ్లీ వేడుకలను జరుపుకోనుంది. ఈ సందర్భంగా ప్లాటినమ్ జూబ్లీ డిపాజిట్‌ను పరిచయం చేయనుంది. 75 వారాల (525 రోజులు) వ్యవధిలో ఉండే ఈ డిపాజిట్ వడ్డీరేటు 7.95 శాతమని ఎస్‌బిహెచ్ చెప్పింది.