బిజినెస్

ఫెడ్ రిజర్వ్ తెచ్చిన ఉత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 30: గత రెండు రోజుల నష్టాలకు బ్రేక్ వేసి దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. వడ్డీరేట్ల పెంపు విషయంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అవలంభించిన వేచిచూత ధోరణి మార్కెట్ సెంటిమెంట్‌ను ఒక్కసారిగా పెంచింది. ప్రస్తుత అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల్లో వడ్డీరేట్ల పెంపుపై ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉందని మంగళవారం ఫెడ్ రిజర్వ్ చైర్‌పర్సన్ జనెట్ యెల్లెన్ అభిప్రాయపడ్డారు. ఇది ఆసియా, ఐరోపా మార్కెట్లను సైతం లాభాల్లో పరుగులు పెట్టించగా, దేశీయ మార్కెట్లకూ కలిసొచ్చింది. అలాగే రాబోయే ద్రవ్యసమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కీలక వడ్డీరేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు, డాలర్‌తో పోల్చితే బలపడిన రూపాయి మారకం విలువ మదుపరులను పెట్టుబడుల వైపునకు నడిపించాయి. విదేశీ ఉక్కు దిగుమతులకు కళ్ళెం వేసేలా కేంద్ర ప్రభుత్వం సుంకాలు పెంచడం కూడా సూచీలను లాభాల్లోకి తెచ్చింది. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 438.12 పాయింట్లు పుంజుకుని మళ్లీ 25వేల స్థాయికి ఎగువన 25,338.58 వద్ద ముగియగా, నెల రోజుల్లో సెనె్సక్స్ ఈ స్థాయిలో లాభపడటం ఇదే ప్రథమం. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 138 పాయింట్లు ఎగిసి మరోసారి 7,700 మార్కును అధిగమిస్తూ 7,735 వద్ద నిలిచింది. విదేశీ మదుపరుల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన పెట్టుబడుల మధ్య బ్యాంకింగ్, ఔషధ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. రియల్టీ, బ్యాంకింగ్, మెటల్, క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రీ, యుటిలిటీస్, పవర్, ఫైనాన్స్ రంగాల షేర్ల విలువ 3.85 శాతం నుంచి 0.13 శాతం పెరిగింది. టెలికామ్ రంగ షేర్ల విలువ మాత్రం 0.13 శాతం పడిపోయింది. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్, సింగపూర్ సూచీలు 2.15 శాతం, 2.77 శాతం చొప్పున పెరిగితే, జపాన్ సూచీ 1.31 శాతం దిగజారింది. ఐరోపా మార్కెట్లలో బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ సూచీలు 1.72 శాతం నుంచి 1.91 శాతం వరకు లాభపడ్డాయి.
రూ. 1.6 లక్షల కోట్లు పెరిగిన మదుపరుల సంపద
స్టాక్ మార్కెట్ల భారీ లాభాలతో మదుపరుల సంపద బుధవారం ఒక్కరోజే గణనీయంగా పెరిగింది. సెనె్సక్స్ 438 పాయింట్లు పుంజుకున్న నేపథ్యంలో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లోని సంస్థల మార్కెట్ విలువ 1,62,392.75 కోట్ల రూపాయలు ఎగిసి 94,51,833 కోట్ల రూపాయలకు చేరింది.