బిజినెస్

విదేశాలకు వలసపోతున్న భారత కుబేరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 30: భారతీయ కుబేరులు దేశం విడిచి వెళ్లిపోతున్నారు. విదేశాలకు మకాం మారుస్తున్నారు. గత ఏడాది ఏకంగా 4,000 మంది మిలియనీర్లు వివిధ దేశాలకు వెళ్లి స్థిరపడ్డారు మరి. ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా భారత్ నాలుగో స్థానంలో ఉండటం గమనార్హం. న్యూ వరల్డ్ వెల్త్ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2015లో దాదాపు 4,000 మంది సంపన్నులు భారత్‌ను వీడారు. కాగా, ఫ్రాన్స్‌లో ఈ విషయంలో మొదటి స్థానంలో ఉంది. నిరుడు అత్యధికంగా 10,000 మంది సంపన్నులు దేశం విడిచి వెళ్ళారు. అయితే భారత్, చైనాల నుంచి విదేశాలకు మిలియనీర్ల పోకడ అంతగా ప్రమాదకర స్థాయిలో ఏమీలేదని, వెళ్తున్నవారితో పోల్చితే ఈ దేశాల్లో మిలియనీర్లుగా అవతరిస్తున్నవారు అధికంగా ఉండటమే దీనికి కారణమని న్యూ వరల్డ్ వెల్త్ చెప్పింది. ఇదిలావుంటే స్వదేశం వీడి విదేశాలకు వెళ్తున్న మిలియనీర్లలో చైనా 9,000 మందితో రెండో స్థానంలో, 6,000 మందితో ఇటలీ మూడో స్థానంలో ఉన్నాయి. అలాగే గ్రీస్ నుంచి 3,000 మంది, రష్యా, స్పెయిన్, బ్రెజిల్ నుంచి రెండేసి వేల చొప్పున గత ఏడాది విదేశాలకు వెళ్లిపోయారు. ఇకపోతే క్రిస్టియన్లు, ముస్లింల మధ్య నెలకొన్న మత విద్వేషాలే ఫ్రాన్స్ నుంచి మిలియనీర్ల పోకడకు కారణమని నివేదిక పేర్కొంది. మరోవైపు విదేశాలకు వెళ్తున్న మిలియనీర్లలో అత్యధికులు ఆస్ట్రేలియాకు వెళ్తున్నారని న్యూ వరల్డ్ వెల్త్ చెప్పింది. గత ఏడాది ఈ దేశంలో 8,000 మంది మిలియనీర్లు స్థిరపడ్డారంది. ఆ తర్వాత రెండు స్థానాల్లో అమెరికా, కెనడా దేశాలున్నాయి. అమెరికాకు 7,000 మంది, కెనడాకు 5,000 మంది మిలియనీర్లు కొత్తగా వచ్చారు.