బిజినెస్

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 5: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్యపరపతి విధాన సమీక్ష మదుపరులను మెప్పించలేకపోయింది. అర శాతం తగ్గుతుందన్న అంచనాల మధ్య రెపో రేటును పావు శాతం మాత్రమే తగ్గించిన నేపథ్యంలో మదుపరులు బ్యాంకింగ్ రంగ షేర్లలో పెట్టుబడుల ఉపసంహరణకు ప్రాధాన్యమిచ్చారు. ఫలితంగా ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్‌బిఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్ల విలువ 5.45 శాతం నుంచి 1.03 శాతం మేర పడిపోయాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 516.06 పాయింట్లు క్షీణించి 25 వేల స్థాయికి దిగువన 24,883.59 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 155.60 పాయింట్లు దిగజారి 7,600 మార్కు కింద 7,588.65 వద్ద నిలిచింది. బ్యాంకింగ్ రంగంతోపాటు టెలికామ్, పారిశ్రామిక, ఆటో, మెటల్, క్యాపిటల్ గూడ్స్, ఫైనాన్స్, రియల్టీ, పవర్, ఎఫ్‌ఎమ్‌సిజి రంగాల షేర్ల విలువ పతనమైంది. ఇక అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో జపాన్, హాంకాంగ్, సింగపూర్, దక్షిణ కొరియా సూచీలు 2.42 శాతం నుంచి 0.82 శాతం మేర నష్టపోయాయి. చైనా సూచీ మాత్రం 1.45 శాతం పెరిగింది. ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు సైతం 1.45 శాతం నుంచి 2.61 శాతం మేర పడిపోయాయి.
మార్చిలో రూ. 9 లక్షల కోట్లు పెరుగుదల
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరానికి (016-17)గాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక సాధారణ బడ్జెట్ మదుపరులను విపరీతంగా ఆకట్టుకున్నది తెలిసిందే. ఈ క్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడగా, గత నెల మార్చిలో సెనె్సక్స్ 2,339.86 పాయింట్లు ఎగిసింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లోని సంస్థల మార్కెట్ విలువ 8.91 లక్షల కోట్ల రూపాయలు ఎగబాకింది.