బిజినెస్

‘ఏపీ టూరిజంలో పెట్టుబడులు పెట్టండి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టాలని దక్షిణాసియా హోటల్స్ పెట్టుబడుల సదస్సులో కేంద్ర మంత్రి సుజనా చౌదరి పిలుపునిచ్చారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఈ సదస్సుకు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు తరపునా సుజనాచౌదరి హజరై ప్రసంగించారు. ఏపిలో 974 కిలోమీటర్ల కోస్తాతీరం ఉందని, ప్రసుతం ఏపీ వృద్దిరేటు 10.86 శాతంగా ఉందని, 15 శాతం వృద్ది రేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిల్లో మరిన్ని హోటళ్ల నిర్మాణానికి అవకాశాలు ఉన్నాయని, అమరావతి, విశాఖ, తిరుపతిల్లో మెగా కనె్వన్షన్ సెంటర్లు నిర్మించనున్నాట్లు సుజనా చెప్పారు. ప్రస్తుతం ఏపీలో రూ 10 వేల కోట్ల మేర పర్యాటక రంగ పెట్టుబడులు పెడుతున్నారని, ఇందులో రూ. 1,500 కోట్ల పెట్టుబడులు కార్యరూపం దాల్చాయన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో
ఎయిర్‌టెల్ 4జి సేవల విస్తరణ
హైదరాబాద్, ఏప్రిల్ 5: దేశీయ టెలికామ్ రంగ దిగ్గజం ఎయిర్‌టెల్.. తెలుగు రాష్ట్రాల్లో 4జి సేవలను విస్తరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 40 పట్టణాల్లో 4జి సేవలు అందుబాటులో ఉన్నాయని మంగళవారం ప్రకటించింది. దీంతో ఇక్కడి తమ వినియోగదారులు ఇక హైస్పీడ్ వైర్‌లెస్ బ్రాడ్‌బాండ్‌ను వాడుకోవచ్చని పేర్కొంది. గత సంవత్సరం మే నెలలో హైదరాబాద్‌లో 4జి సేవలను ప్రారంభించామని, 10 నెలల్లోనే 40 పట్టణాలకు విస్తరించామని సంస్థ ప్రతినిధి వెంకటేశ్ విజయరాఘవన్ చెప్పారు.