బిజినెస్

ఏపి, తెలంగాణ మార్కెట్‌లోకి సరికొత్త సుజుకి యాక్సెస్ 125

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 5: విశ్వవ్యాప్తంగా ద్విచక్ర వాహనాల తయారీలో అగ్రగామిగా గుర్తింపు పొందిన సుజుకి మోటార్స్.. ఐదు ఆకర్షణీయ రంగుల్లో సరికొత్త యాక్సెస్ 125 ద్విచక్ర వాహనాన్ని మంగళవారం తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ సరికొత్త యాక్సెస్ 125 బాడీ ఫ్రేమ్ దృఢత్వంతోపాటు తక్కువ బరువు కలిగి, చక్కటి స్థిరత్వం, కార్నరింగ్ పెర్‌ఫార్మెన్స్‌తో అధిక మైలేజీ ఇస్తుందని సుజుకి సంస్థ సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ కెంజి హిరోజావా తెలిపారు. అసమాన రహదారులపై ప్రయాణం స్థిరంగా, సాఫీగా సాగేందుకు ఆప్టిమైజ్డ్ సివిటి సెట్టింగ్స్‌తో తయారు చేసిన సరికొత్త యాక్సెస్ 125 స్టీల్ ఫ్రంట్ ఫెండర్, స్టీల్ లెగ్ షీల్డ్‌తో పూర్తి రక్షణగా ఉంటుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వినియోగదారులకు యాక్సెస్ 125 కీలక మార్కెట్ కానుందని, ఎస్‌ఇపి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ వాహనం ఎలాంటి ప్రయాణానికైనా సులువవుతుందని, ప్రధానంగా రైడర్స్‌కు ఇది ఎంతో సుఖమయమైందన్నారు. సరికొత్త యాక్సెస్ ద్వారా మరికొన్ని సేవలను అందించేందుకు సుజుకి ప్రయత్నిస్తుందని, ఐదు రంగుల్లో పెరల్ సుజుకి డీప్ బ్లూ, క్యాండి సోనోమా రెడ్, పెరల్ మిరాజ్‌వైట్, మెటాలిక్ మ్యాట్ ఫ్రైబ్రాయిన్ గ్రే, గ్లాస్ స్పార్కెల్ బ్లాక్‌లో ఉంటుందని, దీని ధర అందరికీ అందుబాటులో ఉందన్నారు. సుజుకి సరికొత్త యాక్సెస్ 125 బైక్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ రూ. 63,991లకు లభిస్తుందని కెంజి హిరోజావా వివరించారు.