బిజినెస్

ఎంఓయుల రద్దుతో ఆన్‌రాక్, జెఎస్‌డబ్ల్యు డీలా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 13: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ సరఫరా ఒప్పందాలను రద్దు చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకూ ఆయా సంస్థలు పెట్టిన పెట్టుబడులపై మాత్రం పెదవి విప్పడం లేదు. ఎంఓయులు కుదుర్చుకున్నప్పటి నుంచి 2013 వరకూ ఆయా సంస్థలు దాదాపు రూ. 142 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. అర్ధాంతరంగా ఒప్పందాలు రద్దవడంతో పెట్టిన పెట్టుబడులు రాబట్టే యత్నంలో రెండు సంస్థలు ఉన్నట్లు సమాచారం. బాక్సైట్ ఖనిజం సరఫరా నిమిత్తం జిందాల్ సౌత్‌వెస్ట్ లిమిటెడ్, ఆన్‌రాక్ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొషన్ (ఎపిఎండిసి)తో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి విదితమే. అయితే ఈ ఒప్పందాల మేరకు ఎపిఎండిసి తరపున బాక్సైట్ తవ్వకాలు, ఇతర అనుమతుల కోసం పెద్ద మొత్తంలోనే రెండు సంస్థలు వెచ్చించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ సంస్థల నుంచి అనుమతులు, నిరభ్యంతర సర్ట్ఫికెట్ల నిమిత్తం ఆన్‌రాక్, జిందాల్ సంస్థలు ఈ మొత్తాన్ని వెచ్చించాయి. పర్యావరణ పరిరక్షణ, శిక్షణ, పరిశోధన సంస్థ (ఇపిటిఆర్‌ఐ), పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, జియాలాజికల్ రిపోర్టు, హైడ్రాలాజికల్ స్టడీస్ తదితరాల కోసం జిందాల్, ఆన్‌రాక్ సంస్థలు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇది కాకుండా సంస్థలు ఏర్పాటు చేసే పరిశ్రమల్లో గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సి ఉంది. దీనికోసం గిరిజన యువతకు పలు అంశాలపై శిక్షణ కార్యక్రమాలను చేపట్టారు. శిక్షణ కార్యక్రమాల వ్యయాన్ని సైతం జిందాల్, ఆన్‌రాక్ సంస్థలే భరించాయి. ఇక బాక్సైట్ తవ్వకాల్లో కీలకభూమిక పోషించే ఎపిఎండిసి అధికారులు, సిబ్బంది ఉండేందుకు అవసరమైన వసతి సదుపాయాల కల్పన, అప్పటికే ఉన్న సదుపాయాల మెరుగు తదితర పనులకు సైతం రెండు సంస్థలు భారీగానే నిధులు వెచ్చించాయి. ఆన్‌రాక్, జిందాల్ సంస్థలు ఖర్చుపెట్టే ప్రతి రూపాయి, ముందుగా కుదుర్చుకున్న ఒప్పందాల్లోనే పొందుపరిచారు. దీంతో ఖర్చయన సొమ్మునంతా రాబట్టుకునే చర్యల్లో రెండు సంస్థలు నిమగ్నమైనట్లు సమాచారం. ఇదంతా ఒకఎత్తయితే ఎపిఎండిసితో ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాత ఆన్‌రాక్, జిందాల్ సంస్థలు ఉన్నతాధికారులకు ఇచ్చిన బహుమతులను సైతం ఖర్చుల్లో లెక్కచూపడం కొసమెరుపు. కాగా, రెండు సంస్థలు మరో రూపంలో తిరిగి బాక్సైట్ సరఫరాకు అనుమతులు సంపాదించే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం.

మార్కెట్లోకి గోల్డివియా
రిఫైండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్

హైదరాబాద్, ఏప్రిల్ 13: దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక మార్కెట్ వాటా కలిగిన అగ్రశ్రేణి వంట నూనెల తయారీ సంస్థ ‘సౌత్ ఇండియా కృష్ణ ఆయిల్ అండ్ ఫాట్స్’ (ఎస్‌ఐకెఓఎఫ్) తమ నూతన బ్రాండ్ గోల్డివియా రిఫైండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను బుధవారం ఇక్కడ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అధిక పోషక విలువలు కలిగి, బహుళ దశల్లో ప్రాసెస్ చేసిన గోల్డివియా నూనె ఒక లీటర్ ప్యాకె ట్లు, ఐదు లీటర్ల జార్‌లో మార్కెట్లో లభ్యమవుతుందని ఎస్‌ఐకెఓఎఫ్ జనరల్ మేనేజర్ పి సుబ్రమణియం చెప్పారు. తమ సంస్థ ప్రస్తుత టర్నోవర్ రూ. 1,400 కోట్లు కాగా, 5 వేల మెట్రిక్ టన్నుల ప్యాకేజ్డ్ ఉత్పత్తులను అమ్ముతోం దని, రాబోయే రెండేళ్లలో 8 వేల మెట్రిక్ టన్నుల ప్యాకేజ్డ్ ప్రొడక్ట్స్ అమ్మకాలతో రూ. 2,240 కోట్ల టర్నోవర్ సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళుతున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా, దక్షిణ భారత దేశంలో 60 శాతం మార్కెట్ వాటా ను సొంతం చేసుకున్నట్లు స్పష్టం చేశారు.

గోల్డివియా రిఫైండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను మార్కెట్‌కు పరిచయం చేస్తున్న సంస్థ ప్రతినిధులు