బిజినెస్

ఈ ఏడాది ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 13: నిపుణులు, శాస్తవ్రేత్తలు ఈ ఖరీఫ్ సీజన్‌లో జూన్ 5 నాటికల్లా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. మంత్రి పుల్లారావు బుధవారం నగరంలో 13 జిల్లాల వ్యవసాయ సంయుక్త సంచాలకులు, శాస్తవ్రేత్తలు, నిపుణులతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2016-17 ఖరీఫ్ సీజన్ ప్రణాళికలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత సీజన్‌లో తక్కువ వర్షపాతం నమోదైందని, ఈ దఫా 106 శాతం వర్షపాతం నమోదు అవుతుందని శాస్తవ్రేత్తలు పేర్కొనడం జరిగిందన్నారు. గత ఆర్థిక సంవత్సరం 2015-16లో 136.73 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని సాధించడం జరిగిందన్నారు. దీంతో 2016-17కు 71.14 లక్షల హెక్టార్లలో 172.08 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు, 9.21 లక్షల టన్నుల నూనెగింజలు ఉత్పత్తులను లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తద్వా రా 19.98 వృద్ధిరేటు సాధించగలుగుతామన్నారు. గత సీజన్‌లో 4 లక్షల మట్టి నమూనాలను సేకరించి విశే్లషణ జరిపి 16.25 లక్షల మంది రైతులకు సాయిల్ హెల్త్ కార్డులను అందించామని, మూడేళ్లపాటు వీటి కాలపరిమితి ఉంటుందన్నారు. ప్రస్తుత సంవత్సరానికి 6.41 లక్షల మట్టి నమూనాలు లక్ష్యంగా 30.80 లక్షల మందికి సాయిల్ హెల్త్‌కార్డులు అందిస్తామన్నారు. గ్రామస్థాయిలో అనుసరించవలసిన పంట సరళి కావలసిన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరపతి అంశాలను దృష్టిలో ఉంచుకుని గ్రామ ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఖరీఫ్ సీజన్‌లో 6.11 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేశామని 2016-17కు 3.96 లక్షల క్వింటాళ్ల వివిధ దూర్పికరణ విత్తనాలను రైతులకు 50 శాతం సబ్సిడీపై అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2016 ఖరీఫ్‌కు గాను 8.84 లక్షల క్వింటాళ్ల విత్తనాలను ముందస్తుగా రైతుల నుండి వివిధ సంస్థలైన ఎపి సీడ్స్, ఆయిల్ ఫెడ్, మార్క్‌ఫెడ్ ద్వారా సేకరించామని మే మొదటివారంలో రైతులకు మండల విత్తన పంపిణీ కేంద్రాల ద్వారా అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి వెల్లడించారు. 2016-17 ఖరీఫ్, రబీ సీజన్‌లో 16.15 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు సరఫరా చేశామని 2016- 17 ఖరీఫ్‌లో 19.5 మెట్రిక్ టన్నుల వివిధ రసాయనిక ఎరువులు అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. గత సీజన్‌లో 47,817 కోట్ల పంట రుణాలు, రూ. 14,059 కోట్ల టర్న్ రుణాలను రైతులకు అందించామన్నారు. ప్రస్తుత సీజన్‌లో రూ. 74,817 కోట్లు లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. 2015-16లో ఉత్తమ యాజమాన్య రైతు పద్ధతుల ద్వారా 4,899 చంద్రన్న రైతు క్షేత్రాలను నిర్వహించాలని, ఈ సీజన్‌లో 3,500 నిర్వహించాలని లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందన్నారు. గత సీజన్‌లో 687 రెయిన్ గన్‌లను అందుబాటులోకి తేవడం ద్వారా 9,080 హెక్టార్లలో నీటి వనరుల తగ్గుదల వున్నా అందుకోగలిగామన్నారు. ఈ సీజన్‌లో 9.3 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలను సంరక్షించేందుకు 15,497 రెయిన్ గన్స్ సరఫరాను లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్, సంచాలకులు ధనుంజయ రెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్ మధుసూధనరావు, రీసెర్చి సంచాలకులు ఎమ్‌వి నాయుడు, ఎమ్‌డి ఎపి సీడ్స్ మధుసూధన రెడ్డి, ఎక్సిటేషన్ సంచాలకులు కె రాజారెడ్డి, సంయుక్త సంచాలకులు, శాస్తవ్రేత్తలు, నిపుణులు తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు