బిజినెస్

ఐఐపి, ద్రవ్యోల్బణం జోష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 13: మదుపరుల కొనుగోళ్ల జోరు మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. దాదాపు మూడున్నర నెలల గరిష్ఠానికి సూచీలు చేరుకున్నాయి. బ్యాంకింగ్, ఆటో రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మంగళవారం విడుదలైన పారిశ్రామికోత్పత్తి (ఐఐపి) సూచీ 2 శాతానికి పెరగడం, రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు 6 నెలల కనిష్టానికి దిగిరావడం మదుపరులను పెట్టుబడుల వైపునకు నడిపించాయి. మూడు నెలల తర్వాత ఫిబ్రవరిలో ఐఐపి 2 శాతానికి పెరిగితే, చిల్లర ద్రవ్యోల్బణం మార్చిలో 4.83 శాతానికి దిగివచ్చింది. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) రాబోయే ద్రవ్యసమీక్షల్లో కీలక వడ్డీరేట్లను మరింతగా తగ్గిస్తుందన్న అంచనాలు మదుపరులలో నెలకొన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను ఈ నెల తొలి వారంలో జరిపిన మొదటి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రెపో రేటును ఆర్‌బిఐ పావు శాతం తగ్గించినది తెలిసిందే. అంతేగాక ఈసారి వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా కురుస్తాయన్న వాతవరణ శాఖ అంచనాలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) భారత జిడిపి వృద్ధిరేటును యథాతథంగా 7.5 శాతంగా అంచనా వేయడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. నిజానికి ఉదయం ప్రారంభం నుంచే సూచీలు భారీ లాభాల్లో కదలాడాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 372 పాయింట్లు, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 112 పాయింట్ల చొప్పున పెరిగాయి. సమయం గడుస్తున్నకొద్దీ లాభాలు క్రమేణా పెరగగా, చివరకు మార్కెట్ ముగిసే సమయానికి సెనె్సక్స్ 481.16 పాయింట్లు ఎగిసి 25,626.75 వద్ద స్థిరపడింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి గమనిస్తే సెనె్సక్స్‌కు ఇదే గరిష్ఠ స్థాయి. ఇక నిఫ్టీ 141.50 పాయింట్లు పుంజుకుని 7,800 మార్కును అధిగమించి 7,850.45 వద్ద నిలిచింది. అంతకుముందు సోమ, మంగళవారాల్లోనూ స్టాక్‌మార్కెట్లు లాభాల్లోనే నడవగా, బుధవారం లాభాలతో వరుసగా మూడు రోజులు పురోగమించినట్లైంది. దీంతో మొత్తం ఈ వారంలో ట్రేడింగ్ జరిగిన మూడు రోజుల్లోనే సెనె్సక్స్ 952.91 పాయింట్లు ఎగబాకితే, నిఫ్టీ 295.25 పాయింట్లు ఎగిసింది. ఆయా రంగాల వారీగా ఆటో, బ్యాంకింగ్, మెటల్, ఎఫ్‌ఎమ్‌సిజి, రియల్టీ, విద్యుత్ రంగాల షేర్ల విలువ 3.59 శాతం నుంచి 1.37 శాతం పెరిగాయి. రిటైల్ మదుపరుల కొనుగోళ్లతో బిఎస్‌ఇ స్మాల్-క్యాప్ 1.06 శాతం, మిడ్-క్యాప్ 0.91 శాతం చొప్పున పెరిగాయి. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో హాంకాంగ్, జపాన్, చైనా సూచీలు 3.19 శాతం నుంచి 1.42 శాతం వరకు లాభపడ్డాయి. అంచనాలను మించి చైనా ఎగుమతులు వృద్ధిని సాధించడం మార్కెట్లను పరుగులు పెట్టించాయి. మరోవైపు ఐరోపా మార్కెట్లు సైతం లాభాల్లోనే కదలాడాయి. ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు 2.53 శాతం వరకు పెరిగాయి.

లక్ష కోట్లు పెరిగిన
మదుపరుల సంపద
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను అందుకున్న క్రమంలో మదుపరుల సంపద కూడా అంతే స్థాయిలో ఎగబాకింది. ముఖ్యంగా బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లోని సంస్థల మార్కెట్ విలువ బుధవారం ఒక్కరోజే లక్ష కోట్ల రూపాయలకుపైగా ఎగిసింది. 1.35 లక్షల కోట్ల రూపాయలు పెరిగి మదుపరుల సంపద 96.92 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నట్లు బిఎస్‌ఇ వర్గాలు తెలిపాయి.

మళ్లీ సోమవారమే ట్రేడింగ్
ముంబయి: బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లకు గురు, శుక్రవారాలు రెండు రోజులపాటు సెలవు కావడంతో మళ్లీ ట్రేడింగ్ సోమవారమే జరగనుంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా గురువారం, శ్రీరామ నవమిని పురస్కరించుకుని శుక్రవారం మార్కెట్లు బంద్. ఆ తర్వాత రెగ్యులర్ సెలవు దినాలైన శని, ఆదివారాలు. దీంతో వరుసగా నాలుగు రోజులు మార్కెట్లు మూతపడనుండగా, తిరిగి సోమవారం యథాతథంగా ట్రేడింగ్ జరగనుంది.