బిజినెస్

దేశ, విదేశీ మార్కెట్లలో రూ. 6 లక్షల కోట్ల నిధుల సమీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: ఈ ఏడాది దేశ, విదేశీ క్యాపిటల్ మార్కెట్ల నుంచి భారతీయ సంస్థలు 6.3 లక్షల కోట్ల రూపాయలకుపైగా నిధులను సమీకరించాయి. దేశీయ మార్కెట్ల నుంచి 5.75 లక్షల కోట్ల రూపాయలను, విదేశీ మార్కెట్ల నుంచి 58,900 కోట్ల రూపాయలను ఆయా సంస్థలు అందుకున్నాయి. ఎడిఆర్, జిడిఆర్ సెక్యూరిటీలు, విదేశీ బాండ్లు తదితర మార్గాల ద్వారా ఈ నిధులను పొందాయి. ఈ మేరకు ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ తెలియజేశారు. కాగా, గత ఏడాది ఇలా పొందిన నిధుల విలువ 5.85 లక్షల కోట్ల రూపాయలుగా ఉండగా, ఈ ఏడాది అది మరో 50,000 కోట్ల రూపాయలు పెరిగింది. ఈ ఏడాది ఈక్విటీ, బాండ్ మార్కెట్ల ద్వారా నిధుల సమీకరణ ఉత్సాహంగా కొనసాగిందని, మెరుగైన ఆర్థిక పరిస్థితులతో వచ్చే ఏడాది కూడా భారతీయ సంస్థల నిధుల సమీకరణ దూసుకెళ్తుందన్న విశ్వాసాన్ని జియోజిత్ బిఎన్‌పి పరిబాస్ రిసెర్చ్ అధిపతి అలెక్స్ మాథ్యూ తెలిపారు.