బిజినెస్

భారతీయ మార్కెట్లలోకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ప్రతికూలతల మధ్య కూడా దేశీయ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడు లు పోటెత్తుతున్నాయ. ఈ ఏడాది తొలి రెండు నెలల్లో పెట్టుబడుల ఉపసంహరణల ధ్యాసతోనే నడిచిన విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ).. మలి రెండు నెలల్లో మాత్రం పెట్టుబడుల ప్రవాహాన్ని సృష్టిస్తున్నా రు. గత నెల మార్చిలో షేర్ల కొనుగోళ్లకు విశేషంగా ఆసక్తి కనబరిచిన మదుపరులు.. ఈ నెలలోనూ అదే దారిలో వెళ్తున్నారు. ఏప్రిల్‌లో ఇప్పటిదాకా బిలియన్ డాలర్లకుపె గా పెట్టుబడులను పట్టుకొచ్చారు. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్న అంచనాలు మదుపరులను విపరీతంగా ఆకట్టుకున్నాయ. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2016-17) గాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఏప్రిల్‌లో జరిపిన తొలి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రెపో రేటును ఐదేళ్ల కనిష్టానికి తగ్గిస్తూ 6.5 శాతానికి తీసుకొచ్చింది. దీంతో మార్కెట్ సెంటిమెం ట్ బలపడింది. అలాగే ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపు ఆలస్యం అవుతుం దన్న సంకేతాలూ ఎఫ్‌పిఐల చూపును బారతీయ స్టాక్ మార్కెట్ల వైపు మళ్లించాయ. నిజానికి జనవరి, ఫిబ్రవరి నెలల్లో 16,647 కోట్ల రూపాయల పెట్టుబడులను భారతీయ స్టాక్ మార్కెట్ల నుంచి ఎఫ్‌పిఐలు గుంజేసుకున్నారు. నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యనైతే ఏకంగా 41,661 కోట్ల రూపాయల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయతే 2016-17కుగాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్‌లో ఫిబ్రవరి నెలాఖర్లో ప్రవేశపెట్టిన సాధారణ వార్షిక బడ్జెట్ అనంతరం పరిస్థితులు మారిపోయాయ. ద్రవ్య లోటును జిడిపిలో 3.5 శాతానికే కట్టడి చేస్తామన్న జైట్లీ వ్యాఖ్యలు స్వదేశీ మదుపరులతోపాటు విదేశీ మదుపరులలో కొత్త ఉత్సాహాన్ని నింపాయ. ఈ క్రమంలోనే పెట్టుబడులు భారీగా తరలి రాగా, మార్చి నెలలో దేశీయ స్టాక్, రుణ మార్కెట్లలోకి ఎఫ్‌పిఐలు 19,967 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు. ఇదిలావుంటే ఈ నెలలో స్టాక్ మార్కెట్లలోకి 4,020 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చిన విదేశీ మదుపరులు.. రుణ మార్కెట్లలోకి మరో 4,548 కోట్ల రూపాయల పెట్టుబడులను పట్టుకొచ్చారు. దీంతో మొత్తం క్యాపిటల్ మార్కెట్లలోకి ఏప్రిల్‌లో వచ్చిన నికర విదేశీ పెట్టుబడుల విలువ 8,568 కోట్ల రూపాయలుగా నమోదైంది. మరోవైపు ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా స్టాక్ మార్కెట్లలోకి 8,515 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు రాగా, రుణ మార్కెట్ల నుంచి 2,810 కోట్ల రూపాయల పెట్టుబడుల తరలిపోయాయ. దీంతో ఈ ఏడాది నికర విదేశీ పెట్టుబడుల విలువ 5,705 కోట్ల రూపాయలుగా ఉంది. కాగా, భారతీయ మార్కెట్లలోకి విదేశీ మదుపరుల పెట్టుబడులు గత ఏడాది (2015) భారీగా తగ్గాయి. స్టాక్ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ కేవలం 17,806 కోట్ల రూపాయలు (3.2 బిలియన్ డాలర్లు)గా ఉంటే, రుణ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 45,856 కోట్ల రూపాయలు (7.4 బిలియన్ డాలర్లు)గా ఉంది. మొత్తం స్టాక్, రుణ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 63,662 కోట్ల రూపాయలకు పరిమితమైంది. అంతకుముందు ఏడాది 2014లో స్టాక్ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువే దాదాపు లక్ష కోట్ల రూపాయలుగా ఉండటం గమనార్హం. 2012, 2013 సంవత్సరాల్లోనూ లక్ష కోట్ల రూపాయల చొప్పున విదేశీ పెట్టుబడులు దేశీయ స్టాక్ మార్కెట్లలోకి వచ్చాయి. ఇక రుణ మార్కెట్లలోకి 2014లో వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 1.6 లక్షల కోట్ల రూపాయలు (26 బిలియన్ డాలర్లు)గా ఉంది. 2014లో మొత్తం రెండున్నర లక్షల కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు అటు స్టాక్, ఇటు రుణ మార్కెట్లలోకి తరలివచ్చాయ. అయతే 2013లో రుణ మార్కెట్ల నుంచి 51,000 కోట్ల రూపాయల (8 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయినప్పటికీ 2012లో 35,000 కోట్ల రూపాయలు, 2011లో 42,000 కోట్ల రూపాయలు, 2010లో 46,408 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు.