బిజినెస్

రూ. 526 కోట్లతో కాఫీ ప్రాజెక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 13: రాష్ట్ర గిరిజన సహకార సంస్థ (జిసిసి) ఆధ్వర్యంలో విశాఖ ఏజెన్సీలో పాడేరు కాఫీ ప్రాజెక్టును 526 కోట్ల రూపాయలతో ప్రారంభించినట్టు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖా మంత్రి రావెల కిశోర్‌బాబు తెలిపారు. అరకు వ్యాలీ కాఫీ పేరుతో విశాఖ ఏజెన్సీకి బ్రాండ్ తీసుకువచ్చే విధంగా రూపొందించిన కాఫీ పొడిని ఆదివారం నగరంలోని ఓ హోటల్‌లో మంత్రి విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లక్ష ఎకరాల్లో కాఫీ సాగు జరుగుతోందని, మరో లక్ష ఎకరాలను సాగులోకి తీసుకువస్తున్నట్టు చెప్పారు. పాడేరు కాఫీ ప్రాజెక్టులో భాగంగా గిరిజనుల నుంచి ముడి కాఫీ గింజల సేకరణ, కాఫీ పౌడర్లు అరుకు వ్యాలీ కాఫీ పేరుతో విశాఖ ఏజెన్సీ బ్రాండ్‌ను తీసుకువచ్చేలా దీనిని రూపొందించామన్నారు. గిరిజనుల నుంచి సేకరించే కాఫీ గింజలకు మంచి ధర కల్పించే దిశగా జిసిసి కృషి చేస్తోందన్నారు.
గతంలో కిలో కాఫీ గింజలకు 90 రూపాయలు చెల్లించేవారని, అయతే ఇపుడు 180 రూపాయలు చెల్లించి గిరిజనులను ఆదుకుంటున్నామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో కాఫీకి మంచి డిమాండ్ ఉందన్న ఆయన అందులో అరకు వ్యాలీ పేరుతో దేశీయ మార్కెట్‌లో ఉత్పత్తుల విక్రయాలు ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది గిరిజనుల నుంచి 25 కోట్ల రూపాయల విలువైన రెండు వేల మెట్రిక్ టన్నుల కాఫీ గింజలు కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు. కాగా, గిరిజనుల ఆమోదంతోనే బాక్సైట్ తవ్వకాలను చేపడతామని స్పష్టం చేశారు. వీరికి వ్యతిరేకమైన కార్యకలాపాలు ఏమీ చేపట్టబోమన్నారు.
బాక్సైట్ సంపదను వైఎస్సార్ ప్రభుత్వం దోచుకుందని, దీనికి సంబంధించి పూర్తి ఆధారాలున్నాయన్న ఆయన బాక్సైట్ విషయంలో తమ ప్రభుత్వం ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోదని, గత ప్రభుత్వ హయాంలో 700 కోట్ల రూపాయలతో రైతులకు చెందాల్సిన సొమ్ము పక్కదారి పట్టినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని కూడా చెప్పారు. కాఫీ పొడి విడుదలలో జిసిసి సిఎండి ఏఎస్‌పిఎస్ రవిప్రకాష్, ఐటిడిఏ పివో హరినారాయణ పాల్గొన్నారు.