బిజినెస్

వ్యాపార అనుకూల పరిస్థితులపై కెటిఆర్ కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సానుకూల వాతావరణం కల్పించడం ద్వారా పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా మంచి ర్యాంకు సాధించాలని టిఎస్ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు అధికారులకు సూచించారు. గతంలో ఈ అంశంలో ప్రపంచ బ్యాంకు మంచి ర్యాంకు ఇవ్వకపోవడంతో శాఖల వారీగా అధికారులతో శనివారం ఇక్కడ కెటిఆర్ సమీక్ష జరిపారు. మెరుగైన ర్యాంకు సాధించేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. ఇంధనం, మున్సిపల్, న్యాయ, అటవీ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సమీక్ష జరిగింది. కాగా, జూన్ ముగింపు నాటికి స్కాడా విధానం ద్వారా జిహెచ్‌ఎంసి పరిధిలో విద్యుత్ సరఫరా చేస్తామని ఇంధన శాఖ అధికారులు తెలిపారు. మున్సిపల్ శాఖలో, మున్సిపాలిటీల్లో అందుబాటులో ఉన్న అన్ని మాస్టర్ ప్లాన్లను వెబ్‌సైట్‌లోకి అప్‌లోడ్ చేయాలని నిర్ణయించారు. ఇక ఫిర్యాదుల స్వీకరణకు ఒక మెకానిజం ఏర్పాటు చేయనున్నారు. వాణిజ్య న్యాయ స్థానాలను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్టు న్యాయశాఖ తెలిపింది. మరోవైపు ఈ అంశంపై 15 రోజులకోసారి సమావేశం ఏర్పాటు చేయాలని కెటిఆర్ అధికారులను ఆదేశించారు. ప్రతి శాఖకు ఒక డ్యాష్ బోర్డు ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నామని, దీని ద్వారా ప్రతి కార్యదర్శి పని సులభమవుతుందన్నారు. సమీక్షలో సిసిఎల్‌ఎ, జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఎ కమిషనర్లు, ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.

అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి కెటిఆర్

స్పెక్ట్రమ్ వేలానికి టెలికామ్ కమిషన్ ఆమోదం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: అందుబాటులో ఉన్న మొత్తం స్పెక్ట్రమ్ వేలానికి టెలికామ్ కమిషన్ మద్దతు పలికింది. టెలికామ్ రెగ్యులేటర్ ట్రాయ్ సూచించిన కనీస ధరకే విక్రయించాలని శనివారం నిర్ణయించింది. దీంతో ఖజానాకు 5.36 లక్షల కోట్ల రూపాయల ఆదాయం రానుంది. అలాగే 1 గిగాహెట్జ్‌కు పైనున్న 1800 మెగాహెట్జ్, 2100 మెగాహెట్జ్, 2300 మెగాహెట్జ్ బ్యాండ్‌లలో స్పెక్ట్రమ్‌ను గెలుచుకున్న సంస్థలు చెల్లించాల్సిన మొత్తంలో 50 శాతం వెంటనే, మిగతా 50 శాతం రెండేళ్ల మారటోరియం తర్వాత పదేళ్లలోపు చెల్లించేలా ఇంటర్-మినిస్టీరియల్ ప్యానెలైన టెలికామ్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు వేలంలో గెలుచుకున్న స్పెక్ట్రమ్ విలువలో 33 శాతం మాత్రమే వెంటనే చెల్లించేవారు.