బిజినెస్

వరుస లాభాలకు బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 30: వరుస రెండు వారాల లాభాలకు బ్రేక్ వేస్తూ దేశీయ స్టాక్ మార్కెట్లు గడచిన వారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 231.52 పాయింట్లు కోల్పోయి 25,606.62 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 49.50 పాయింట్లు పడిపోయి 7,849.80 వద్ద నిలిచింది. అంతకుముందు రెండు వారాల్లో సెనె్సక్స్ 1,164.30 పాయింట్లు, నిఫ్టీ 344.10 పాయింట్లు చొప్పున లాభపడినది తెలిసిందే. కాగా, ఏప్రిల్ నెలకు సంబంధించి డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియడం, అమెరికా, జపాన్ రిజర్వ్ బ్యాంక్‌ల సమావేశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ముఖ్యంగా జూన్‌లో వడ్డీరేట్ల పెంపునకు అవకాశాలు న్నాయని ఫెడ్ రిజర్వ్ సంకేతాలివ్వడం దేశీయ స్టాక్ మార్కెట్లను కుంగదీసింది. అంతర్జాతీయ మార్కెట్లూ నష్టాల పాలయ్యాయ. అలాగే గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ సంవత్సరం జనవరి-మార్చి వ్యవధికి కార్పొరేట్ సంస్థలు ప్రకటించిన ఆర్థిక ఫలితాలు కూడా మదుపరుల కొనుగోళ్ల శక్తిని దెబ్బతీసింది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కీలకమైన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లు ఆమోదం వంటి వాటిపైనా మదుపరులలో సందేహాలు నెలకొనడం మార్కెట్ నష్టాలకు కారణమని నిపుణులు గడచిన వారం ట్రేడింగ్ సరళిని విశే్లషిస్తున్నారు. ఇకపోతే విద్యుత్, ప్రభుత్వరంగ సంస్థ లు, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆటో, క్యాపిటల్ గూడ్స్, చమురు, గ్యాస్, ఎఫ్‌ఎమ్‌సిజి, మెటల్, ఐటి, హెల్త్‌కేర్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. 2.21 శాతం నుంచి 0.04 శాతం వరకు నష్టపోయాయ. ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజ ఐసిఐసిఐ బ్యాంక్ షేర్ విలువ అత్యధికంగా 6.09 శాతం క్షీణించింది. జనవరి-మార్చిలో నికర లాభం భారీగా పడిపోవడమే కారణం. ఎస్‌బిఐ షేర్ విలువ కూడా 5.48 శాతం పతనమైంది. అయితే రియల్టీ, బ్యాంకింగ్, టెక్నాలజీ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. 3.75 శాతం నుంచి 0.31 శాతం వరకు పెరిగాయ. దేశీయ ఐటిరంగ దిగ్గజం టిసిఎస్ షేర్ విలువ 4.67 శాతం ఎగిసింది. బిఎస్‌ఇ మిడ్-క్యాప్ సూచీ 0.22 శాతం పెరిగితే, స్మాల్-క్యాప్ సూచీ 0.53 శాతం నష్టపోయింది. ఇక విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ), విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్‌ఐఐ) గడచిన వారం ట్రేడింగ్‌లో 1,281.43 కోట్ల రూపాయల విలువైన షేర్లను కొనుగోలు చేసినట్లు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. టర్నోవర్ విషయానికొస్తే గడచిన వారం బిఎస్‌ఇ 15,283.21 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ 94,953.22 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు వారం బిఎస్‌ఇ టర్నోవర్ 10,743.69 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ టర్నోవర్ 75,491.52 కోట్ల రూపాయలుగా ఉంది.