బిజినెస్

ఆంధ్రా లేసును మింగేస్తున్న డ్రాగన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఏప్రిల్ 30: ఒకప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో హొయలొలికిన ఆంధ్రా లేసు ఉత్పత్తులు ప్రస్తుతం చైనా నుండి ఎదురవుతున్న పోటీని తట్టుకోలేక కుదేలవుతున్నాయి. చైనాలో యంత్రాలపై తయారైన లేసు ఉత్పత్తుల ముందు చేతి అల్లికలపై ఆధారపడిన ఆంధ్రా లేసు ఉత్పత్తులు వెలవెలబోతున్నాయి. ధర తక్కువగా ఉండటం, నిర్ణీత సమయంలో సరఫరా చేస్తుండటంతో చైనా లేసు ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్‌ను ఏలుతున్నాయి. నిజానికి ప్రపంచంలోని అనేక దేశాల్లో ఆంధ్రా లేసు ఉత్పత్తులకు ఎంతో డిమాండ్ ఉండేది.
అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఐరోపా తదితర దేశాలకు ఆంధ్రా లేసు ఉత్పత్తులు ఎగుమతి అయ్యేవి. ఒక దశాబ్దం క్రితం వరకు ఈ దేశాల నుంచి ఆర్డర్ల మీద ఆర్డర్లు వచ్చేవి. ఫలితంగా ఏటా కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యం లభించేది. కాని ఇప్పుడు ఆ పరిస్థితి కానరావడం లేదు. అంతర్జాతీయంగా ఆదరణ తగ్గిపోవడంతో ఇక్కడి ఎగుమతిదారులు ఆర్డర్ల కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కానీ ఎంతో డిమాండ్ ఉన్న ఆంధ్రా లేసు ఉత్పత్తుల స్థానాన్ని ఇప్పుడు చైనా లేసు ఉత్పత్తులు ఆక్రమించాయి. దేశీయ లేసు ఉత్పత్తులది 150 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా తీరానికి ఆనుకుని ఉన్న గ్రామాల్లో లేసు అల్లిక ఒక కుటీర పరిశ్రమగా వర్ధిల్లేది. స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిషు వారి ద్వారా ఇతర దేశాలకు లేసు ఉత్పత్తుల ఘనత పాకిందని చెబుతారు. మహిళలు ఇంట్లోనే తీరిక సమయాల్లో లేసు అల్లుతూ ఆదాయాన్ని పొందేవారు. ఎగుమతిదారులు తమ ఆర్డర్లకు అనుగుణంగా మహిళలకు దారాలు వంటి ముడిసరుకు సరఫరాచేసి, వారి నుండి అల్లిక పూర్తయిన ఉత్పత్తులను సేకరించి, ఎగుమతి చేసేవారు. ప్రధానంగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం తీర ప్రాంత గ్రామాలు లేసు అల్లికలకు పేరుగాంచాయి. చేతితో అల్లిన ఈ ఉత్పత్తులపై విదేశీయులు ఎంతో మక్కువ చూపేవారు. ఫలితంగా నరసాపురం కేంద్రంగా లేసు ఉత్పత్తుల ఎగుమతులు జోరుగా సాగేవి. ఈ నేపథ్యంలోనే నరసాపురం ప్రాంతంలో ప్రభుత్వం లేసు పార్కును కూడా స్థాపించింది. అనంతరం దీన్ని అలంకృత లేసు పార్కుగా అభివృద్ధి చేశారు. నరసాపురంతోపాటు పాలకొల్లు, భీమవరం, యలమంచిలి, ఆచంట, పెనుగొండ, తూర్పుగోదావరి జిల్లాలోని సఖినేటిపల్లి, రాజోలు, అమలాపురం తదితర ప్రాంతాల్లోని మహిళలు ఈ లేసు అల్లికలు చేసేవారు. అలంకృత లేసుపార్కు ద్వారా అమెరికాకు లేసుతో అల్లిన గృహాలంకరణ ఉత్పత్తులను ఎగుమతి చేసేవారు.
ఇక స్వీడన్‌వాసులు గార్మెంట్లు, ఆస్ట్రేలియా ప్రజలు మాత్రం చిన్నారులు వేసుకునే లేసు వస్త్రాలు ఎక్కువగా కోరుకునేవారు. ఇక దేశీయ మార్కెట్‌లో కిడ్స్‌వేర్‌లకు ఎక్కువ డిమాండ్ ఉంది. విదేశీ మార్కెట్‌లో గత కొంతకాలంగా చైనా లేసుకు డిమాండ్ పెరిగింది. యంత్రాలపై తయారయ్యే చైనా లేసు ఉత్పత్తులు నాజూకుగా ఉండటంతోపాటు, తక్కువ సమయంలోనే సరఫరా చేస్తుండటం ఇందుకు కారణం. మరోవైపు రాన్రాను మహిళలకు అల్లికలపై ఆసక్తి తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ కేంద్ర జౌళి శాఖ అధికారులు మేల్కోవడంలేదు. చైనాకు దీటుగా దేశీయ లేసు ఉత్పత్తుల అభివృద్ధికి ఒక కార్యాచరణ చేపడితే మళ్లీ పూర్వ వైభవం సంతరించుకోవచ్చని ఎగుమతిదారులు చెబుతున్నారు.
chitram...
నరసాపురంలోని లేసు పార్కు.. ఆస్ట్రేలియా, జర్మనీలకు ఎగుమతి చేసే లేసు వస్త్రాలు