బిజినెస్

50 మంది ఎగవేసింది రూ. 1.21 లక్షల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 3: ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగవేతకు పాల్పడినవారిలో 50 మంది ఎగవేసిన మొత్తం విలువ 1.21 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా ఈ మేరకు రాజ్యసభకు ఓ లిఖితపూర్వక సమాధానంగా తెలిపారు. 2015 డిసెంబర్ నాటికి ప్రభుత్వరంగ బ్యాంకుల రుణ ఎగవేతదారుల సంఖ్య 7,686గా ఉందన్న ఆయన మూడేళ్ల క్రితం ఇది 5,554గా ఉందన్నారు. ఈ క్రమంలోనే బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున రుణాలు తీసుకుని ఎగవేసిన తొలి 50 మంది బకాయిల విలువ 1,21,832 కోట్ల రూపాయలుగా ఉందని చెప్పారు.

భారతీ రిటైల్ ఎండిగా కిశోర్ బియాని
న్యూఢిల్లీ, మే 3: ఫ్యూచర్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కిశోర్ బియాని.. భారతీ రిటైల్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి)గా నియమితులయ్యారు. గత ఏడాది ప్రకటించిన ఫ్యూచర్ రిటైల్, భారతీ రిటైల్ విలీనంలో భాగంగా బియాని ఈ కొత్త బాధ్యతలు అందుకుంటున్నారు. ఇక ఫ్యూచర్ గ్రూప్ డైరెక్టర్‌గా ఉన్న రాకేశ్ బియాని.. భారతీ రిటైల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఉంటారు. కాగా, భారతీ రిటైల్ త్వరలో ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్‌గా రూపాంతరం చెందనుంది. నిరుడు మే నెలలో భారతీ రిటైల్‌లో తమ రిటైల్ వ్యాపారాన్ని కలిపేందుకు ఫ్యూచర్ గ్రూప్ అంగీకరించినది తెలిసిందే. ఈ ఒప్పందం విలువ 750 కోట్ల రూపాయలు.

పేమెంట్స్ బ్యాంక్‌గా ఎయిర్‌టెల్ ఎమ్ కామర్స్
న్యూఢిల్లీ, మే 3: ఎయిర్‌టెల్ ఎమ్ కామర్స్ సర్వీసెస్ పేరును ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌గా మార్చింది భారతీ ఎయిర్‌టెల్. మంగళవారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) ద్వితీయ త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో పేమెంట్స్ బ్యాంక్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలనుకుంటోంది. పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలకు తాము అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని ఈ పేరు మార్పు తెలియజేస్తున్నట్లు భారతీ ఎయిర్‌టెల్ ఈ సందర్భంగా అభిప్రాయపడింది.