బిజినెస్

మూడు వారాల కనిష్టానికి సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 3: దేశీయ స్టాక్ మార్కెట్లను అంతర్జాతీయ వృద్ధి ఆందోళనలు దెబ్బతీశాయి. మరోసారి యూరోజోన్ మందగమనానికి ఉన్న అవకాశాలు, చైనా ఉత్పాదక రంగం పనితీరు పేలవంగా ఉందంటూ నమోదైన గణాంకాలు.. సూచీలను నష్టపరిచాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ మూడు వారాల కనిష్టాన్ని తాకుతూ 207.27 పాయింట్లు పతనమై 25,229.70 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 7,800 స్థాయిని కోల్పోయి 58.90 పాయింట్ల నష్టంతో 7,747 వద్ద స్థిరపడింది. నిజానికి ఉదయం ప్రారంభంలో సూచీలు లాభాల్లో కదలాడాయి. సోమవారం నష్టాల నేపథ్యంలో సెనె్సక్స్ 166, నిఫ్టీ 57 పాయింట్ల మేర పుంజుకున్నాయి. అయితే సమయం గడుస్తున్నకొద్దీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఇకపోతే ఐటి, మెటల్, పిఎస్‌యు, చమురు, గ్యాస్, ఎఫ్‌ఎమ్‌సిజి, బ్యాంకింగ్, టెక్నాలజీ రంగాల షేర్ల విలువ 1.57 శాతం నుంచి 0.97 శాతం మేర పడిపోయింది. అంతర్జాతీయంగా ఆసి యా మార్కెట్లలో చైనా, దక్షిణ కొరియా సూచీలు 1.85 శాతం, 0.42 శాతం చొప్పున లాభాల్లో ముగియగా, హాంకాంగ్, సింగపూర్, తైవాన్ సూచీలు 0.96 శాతం నుంచి 1.85 శాతం మేర నష్టపోయాయి. జపాన్ సూచీకి సెలవు. ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు 0.81 శాతం నుంచి 1.84 శాతం వరకు క్షీణించాయి.