బిజినెస్

అమ్మకానికి ఆక్సిజన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 3: ఈ నగరానికి ఏమైంది...ఒక పక్క నుసి..మరో పక్క పోగ, ఎవరూ నోరుమెదపరేం...అనే ప్రకటన క్యాన్సర్ వ్యాధికి సంబంధించిందే అయినా కాలుష్యం ముప్పు ఎంత తీవ్రమైందో తేటతెల్లం చేస్తుంది.. ఒకప్పుడు అభివృద్ధి చెంది న దేశాల్లోని మహానగరాల్లో ఉన్న వాయు కాలుష్యం ఇపుడు గ్రేటర్ నగరాలకు, మున్సిపల్ కార్పొరేషన్లకూ వ్యాపిస్తోంది. ఈ క్రమంలో స్వచ్ఛమైన గాలికి కూడా కొరత ఏర్పడింది. స్వచ్ఛమైన మంచినీటిని కొనుక్కుంటున్నట్టే రానున్న రోజుల్లో స్వచ్ఛమైన గాలిని కొనుక్కునే పరిస్థితి దాపురించింది. దీనిని ముందస్తుగా పసిగట్టిన కెనడా సంస్థ ‘విటాలిటీ ఎయిర్’ భారత్ నగరాలపై దృష్టి సారించింది. భారత్‌లో ఈ కెనడా సంస్థ గాలిని అమ్మేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ నెలాఖరు నుండి గాలి కౌంటర్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రధానంగా ఢిల్లీ, ముంబయ, హైదరాబాద్, బెంగళూరులోని షాపింగ్ మాల్స్‌లో కియోస్క్ యంత్రాలను ఏర్పాటు చేయను న్నారు. కెనడా ఆల్బెర్టా పశ్చిమ వాయవ్య ప్రాంతంలోని ఎడ్మంటన్‌లో ఉన్న విటాలిటీ ఎయిర్ సంస్థ ఇప్పటికే చైనాలో తన అమ్మకాలను ప్రారంభించింది. సంస్థ వ్యవస్థాపకుడు మోజెస్ లామ్ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, కాలుష్యకారక పొగతో నిండిపోతున్న నగరాల్లో తమ అమ్మకాలను ప్రారంభించామని అన్నారు. సహజసిద్ధమైన గాలిని మూడు లీటర్లు, 8 లీటర్ల డబ్బాల్లో అమ్మనున్నారు. గాలిని పీల్చేందుకు మాస్కు లు కూడా అందుబాటులో ఉంటా యి. వీటి ధర సుమారు 2,100 రూపాయలుగా ఉండనుంది. ప్రతి శ్వాసకు 12.50 రూపాయిలు వసూలు చేస్తారు. కెనడా రాకీస్ పర్వత శ్రేణిలోని బాన్స్ జాతీయ పార్కు, లేక్ లూయిస్ సరస్సుల వద్ద ఈ గాలిని సేకరిస్తారు. వాక్యూమ్ ప్రక్రియలో 1.50 లక్షల లీటర్ల గాలిని 40 గంటల పాటు సేకరించి డబ్బాల్లో సంపీడనం ద్వారా నింపుతారు. ఢిల్లీకి ఇప్పటికే వంద సీసాలు రాగా, అనుమతులన్నీ వచ్చాక ఆన్‌లైన్‌లో కూడా అమ్మకాలకు ఈ కంపెనీ సిద్ధమవు తోంది. శ్వాసకోశ సంబంధ వ్యాధిగ్ర స్తులు, గర్భిణీలు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు లక్ష్యంగా ఈ కంపెనీ కార్యకలాపాలుండను న్నా య. కాగా, భారత్ తమ అమ్మకాలకు అతిపెద్ద మార్కెట్‌గా భావిస్తున్నట్టు మోజెస్ చెప్పారు. హైదరాబాద్ తర్వాత మిగిలిన మెట్రోలకు, కార్పొరేషన్లకు తాము విస్తరించనున్నట్టు తెలిపారు. మొత్తానికి ఈ గాలి డబ్బాల అమ్మకాల నేపథ్యంలో కాదేదీ.. కవితకు అనర్హం అని మహాకవి శ్రీశ్రీ అన్నట్లుగా, కాదేదీ.. వ్యాపారానికి అనర్హం అన్న రోజులు వచ్చేశాయ నిపిస్తోంది కదూ..