బిజినెస్

అక్రమ రవాణాపై పటిష్ఠ నిఘా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మే 4: రాష్ట్రంలోని అన్ని ఓడ రేవుల్లో (పోర్టులు) సరుకుల అక్రమ రవాణా జరగకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేస్తున్నామని విజయవాడ కస్టమ్స్ కమిషనర్ (ప్రివెంటివ్) ఎస్‌కె రహమాన్ వెల్లడించారు. అక్రమ రవాణాకు ఆస్కారం లేకుండా 68 మంది ప్రత్యేక అధికారులను రాష్టవ్య్రాప్తంగా నియమించామన్నారు. వీరిలో ఒక జాయింట్ కమిషనర్, ఇరువురు సహాయక కమిషనర్లు ఉన్నారని తెలిపారు.
తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో బుధవారం ‘కాకినాడ పోర్టు ఎ గేట్‌వే విజన్ 2020’ పేరుతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రహమాన్ విలేఖరులతో మాట్లాడారు. రానున్న ఐదేళ్లలో కాకినాడ పోర్టులు ఎగుమతి, దిగుమతుల ద్వారా ఆదాయంలో అగ్రభాగాన నిలిచే అవకాశాలున్నాయన్నారు. గత 2015-16 ఆర్థిక సంవత్సరానికి ఈ పోర్టుల ద్వారా 1,208 కోట్ల రూపాయల నికర ఆదాయం లభించిందన్నారు. ప్రస్తుత 2016-17 ఆర్థిక సంవత్సరానికి జరుగుతున్న ఎగుమతి, దిగుమతులను అంచనా వేయగా మరో 20 శాతం ఆదాయం అదనంగా సమకూరే అవకాశం ఉన్నట్టు చెప్పారు. కాగా, రాష్ట్రంలోని పోర్టుల్లో దొంగతనాలను చాలావరకు నివారించగలిగామన్నారు. ముఖ్యంగా కస్టమ్స్ పన్ను ఎగవేతదారులపై గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. బియ్యం, సిగరెట్లు, ఇతర రవాణా సరుకులకు పన్ను చెల్లించని వారిపై దాడులు చేసి, జరిమానా విధించామని పేర్కొన్నారు. కాకినాడ కస్టమ్స్ హౌస్‌లో సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించి, వ్యాపారానికి ఏ విధమైన ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సింగిల్ విండో విధానంలో కస్టమ్స్ శాఖ ఎగుమతి, దిగుమతుల కోసం వెంటనే క్లియరెన్స్‌లు ఇచ్చే ప్రక్రియను ఈ ఏడాది ఫిబ్రవరి నుండి ప్రారంభించినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సాగరమాల పథకం ద్వారా కాకినాడ పోర్టులను మరింత అభివృద్ధి చేయడానికి మార్గం సుగమం అయ్యిందని తెలిపారు. రానున్న నాలుగేళ్లలో ఒఎన్‌జిసి తన వ్యాపార కార్యకలాపాలను విస్తరించనుందని, తద్వారా ప్రభుత్వానికి మరింత ఆదాయం పెరిగే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. కస్టమ్స్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి శనివారం మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ తదితర పోర్టుల్లో గ్రీవెన్స్ నిర్వహిస్తూ షిప్పర్ ట్రేడర్ల సమస్యలను పరిష్కరిస్తున్నామని రెహమాన్ వివరించారు.
రాజమహేంద్రవరం విమానాశ్రయం డైరెక్టర్ రాజ్‌కిశోర్ మాట్లాడుతూ రానున్న రెండేళ్లలో రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు జాతీయ స్థాయికి చేరనున్నట్టు చెప్పారు. ఇప్పటికే రెండు రన్‌వేలు సిద్ధం చేస్తున్నామని, దీని ద్వారా పెద్ద విమానాలు మధురపూడికి రాకపోకలు సాగిస్తాయన్నారు. అలాగే ఎగుమతి, దిగుమతులు పెరిగే అవకాశం ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. కాకినాడ పోర్టు డైరెక్టర్ (కంటైనర్) ఎం మురళీధర్ మాట్లాడుతూ కంటైనర్ల ఏర్పాటుతో చిన్న తరహా పరిశ్రమలకు చాలా లబ్ది చేకూరుతుందన్నారు. సమావేశంలో కాకినాడ సీపోర్టు సిఇఒ ఎఎస్ రావు, కస్టమ్స్ సహాయ కమిషనర్లు శ్రీనివాస్, వికె సింగ్, కాకినాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దంటు సూర్యారావు, ఛాంబర్ డైరెక్టర్ ఎవి రంగారావు, కాకినాడ పోర్టు డైరెక్టర్ ఎం రవికుమార్, ఒఎన్‌జిసి ఇడి అలోక్‌నాథ్, ఎపి ఛాంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉపాధ్యక్షుడు జి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.