బిజినెస్

టమోటా రైతుల్లో ఆనందం --- రూ. 45కు చేరిన కిలో ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, మే 6: చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్‌లో టమోటా ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. నెల రోజులుగా భారీగా పతనమైన టమోటా ధరలు మూడు రోజులుగా ఆశాజనకంగా కనిపిస్తుండటంతో రైతుల ముఖాల్లో మళ్లీ ఆనందం కనబడుతోంది. గత పదహేను రోజులుగా ఆరు నుంచి పది రూపాయల వరకు టమోటా ధర పలికింది. అయతే తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు వస్తుండడంతో ధరలు క్రమేణా పుంజుంటున్నాయి. కిలో ధర గరిష్ఠం గా 45 రూపాయలు పలుకుతోంది. తమిళనాడు, కేరళల్లోని ఆయా ప్రాంతాల్లో దిగుబడితోపాటు కాయ ల సైజు తగ్గడంతో అక్కడి వ్యాపారులు మదనపల్లె ప్రాంతంలోని కొత్తకాయపై మోజు చూపుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయ. దీంతో ధర అమాంతం పెరిగింది. కాగా, ప్రస్తుత ధరలు నిలకడగా ఉంటూనే మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌లోని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

శుక్రవారం చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్‌కు భారీగా వచ్చిన టమోటాలు

మళ్లీ నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు

ముంబయి, మే 6: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. వరుసగా మూడు రోజులు నష్టపోయిన సూచీలు గురువారం లాభాలను అందుకున్నది తెలిసిందే. ఈ క్రమంలో తిరిగి బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 33.71 పాయింట్లు పడిపోయి 25,228.50 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ స్వల్పంగా 2.05 పాయింట్లు కోల్పోయి 7,733.45 వద్ద నిలిచింది. నిజానికి ఉదయం ఆరంభంలో సూచీలు భారీగానే నష్టపోయాయి.
సెనె్సక్స్ 160, నిఫ్టీ 51 పాయింట్ల మేర పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ఒడిదుడుకులే ఇందుకు కారణం. గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చికిగాను కార్పొరేట్ సంస్థలు ప్రకటిస్తున్న ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడమూ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
ఇక హెల్త్‌కేర్, ఐటి, క్యాపిటల్ గూడ్స్, ఎనర్జీ, మెటల్ రంగాల షేర్ల విలువ 0.86 శాతం నుంచి 0.11 శాతం మేర క్షీణించింది. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో చైనా, హాంకాంగ్, సింగపూర్, తైవాన్, జపాన్ సూచీలు 2.82 శాతం నుంచి 0.25 శాతం మేర పడిపోయాయి. ఐరోపా మార్కెట్లలోనూ ఫ్రాన్స్, జర్మ నీ, బ్రిటన్ స్టాక్ మార్కెట్ సూచీలు 0.38 శాతం నుంచి 0.71 శాతం మేర దిగజారాయి.