ఆంధ్రప్రదేశ్‌

గిరిజనులకు మేలు జరిగేలా బాక్సైట్ తవ్వకాలు : రావెల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, మే 8: గిరిజనులకు మేలు జరిగేలా బాక్సైట్ తవ్వకాలు చేపడతామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖా మంత్రి రావెల కిశోర్‌బాబు స్పష్టం చేసారు. ఆదివారం విశాఖ జిల్లా నర్సీపట్నం వచ్చిన ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ బాక్సైట్ తవ్వకాలు చేపట్టకూడదనేది తమ ప్రభుత్వ అభిమతం కాదన్నారు. ఏజన్సీలోని ఖనిజ సంపదను సక్రమంగా ఉపయోగించుకోవాలనేదే తమ ఉద్దేశ్యమన్నారు. గిరిజనులకు ప్రయోజనాలు చేకూరేలా బాక్సైట్ తవ్వకాలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. ఇందు కోసమే బాక్సైట్ తవ్వకాలకు జారీ చేసిన 96 జీవోను రద్దు చేయలేదని విలేఖరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ స్వార్థ ప్రయోజనాల కోసం బాక్సైట్ తవ్వకాలను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టారన్నారు. గిరిజనులకు నష్టం కలిగించేలా ప్రైవేట్ సంస్థలతో కుదుర్చుకున్న ఎంఒయులను రద్దు చేశామన్నారు. గిరిజనుల సంక్షేమం, వారి అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేసారు.
రెసిడెన్షియల్ పాఠశాలలుగా
50 వసతి గృహాలు..
రాష్ట్రంలోని ఎస్సీ వసతి గృహాల్లో ఆశించిన స్థాయిలో ఉత్తీర్ణత శాతం ఉండడం లేదని మంత్రి తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని వసతి గృహాలను దశలవారీగా రెసిడెన్షియల్స్ స్కూల్స్‌గా మార్పు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ ఏడాది 50 వసతి గృహాలను రెసిడెన్షియల్ స్కూల్స్‌గా మార్పు చేసేందుకు క్యాబినెట్‌లో ఆమోదించామన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా రెసిడెన్షియల్స్ స్కూల్స్ విద్యార్థులు ర్యాంకులు సాధిస్తున్నారన్నారు. ఈ ఏడాది రెసిడెన్షియల్స్ స్కూల్స్‌లో 87 శాతం ఉత్తీర్ణత సాధించామన్నారు. విశాఖ ఏజన్సీలో రెండు లక్షల ఎకరాల్లో కాఫీ తోటలు పెంచాలని నిర్ణయించామన్నారు. ఇప్పటికే లక్ష ఎకరాల్లో కాఫీ తోటలు సాగవుతున్నాయన్నారు. ఈ ఏడాది 1,500 టన్నుల కాఫీ పిక్కలు సేకరించామని మరో 1,500 టన్నుల సేకరణకు చర్యలు చేపట్టామన్నారు. కాఫీ ప్రాసెసింగ్‌లో సైతంలో మార్పులు తీసుకువస్తున్నామన్నారు. మార్కెటింగ్ విధానాన్ని బలోపేతం చేసేందుకు ఈ టెండర్ల విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. 2019 నాటికి రాష్ట్రంలోని అన్ని గిరిజన గ్రామాలకు మినరల్ వాటర్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఏజన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజన సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు ఒకే చోట కిచెన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. 40 కిలో మీటర్ల దూరం వరకు వాహనాల్లో భోజన పదార్థాలను సరఫరా చేస్తామన్నారు. మహారాష్టల్రో అమలవుతున్న ఈ విధానాన్ని విశాఖ జిల్లాలో మొట్టమొదటిగా ప్రయోగాత్మకంగా చేపడుతున్నామన్నారు. రానున్న విద్యా సంవత్సరంలో విద్యార్థుల మెస్ ఛార్జీలను 10 శాతం పెంచాలని నిర్ణయించామన్నారు. ఎస్సీ నిరుద్యోగ యువకులకు స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇస్తామన్నారు. ఈ ఏడాది లక్ష మంది యువకులకు శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి కిశోర్‌బాబు తెలిపారు.