బిజినెస్

కింగ్‌ఫిషర్ లావాదేవీలను తెలియపరచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 15: రుణ పీడిత కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత, లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా మనీ లాండరింగ్ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) పట్టు బిగిస్తోంది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, దాని ఉన్నతోద్యోగుల ఆర్థిక లావాదేవీల వివరాలను తెలియపరచాలని దాదాపు ఆరు బ్యాంకులకు ఇడి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా, ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఐడిబిఐ బ్యాంక్ రుణ ఎగవేత కేసులో గత నెల మనీలాండరింగ్ నిరోధక చట్టం కోర్టు మాల్యాకు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్‌ను జారీ చేసినది తెలిసిందే. అయితే 17 బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయలకుపైగా బకాయిపడి, వాటిని చెల్లించక ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారు ముద్రను వేసుకున్న మాల్యా.. లండన్‌కు పారిపోయినదీ విదితమే. మరోవైపు తమ బకాయిలను రాబట్టుకోవడంలో భాగంగా విజయ్ మాల్యా లగ్జరీ విమానాన్ని ఆదాయ పన్ను శాఖ అధికారులు వేలం వేస్తున్నారు. సకల సౌకర్యాలు కలిగి ఉన్న ఈ విమానంలో 25 సీట్లున్నాయి. మాల్యా ‘కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్’ వైభోగానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ విమానం ఉంటుంది.