బిజినెస్

భారత్‌లో డబ్బు సంపాదించాలంటే పన్నులు చెల్లించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 15: మారిషస్‌తో పన్ను ఒప్పందాల సవరణ నేపథ్యంలో భారత్‌లో డబ్బు సంపాదించాలంటే మదుపరులు తప్పక పన్ను చెల్లించాల్సిందేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. కాగా, మారిషస్ ద్వారా భారత్‌లోకి వచ్చే పెట్టుబడులపై పన్ను విధించడం వల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) తగ్గిపోతాయన్న వాదనను జైట్లీ కొట్టిపారేశారు. మారిషస్‌తో దశాబ్దాల క్రితం ఏర్పరచుకున్న పన్ను ఒప్పందాలను సవరించడం వల్ల భారత్‌కు వచ్చే ఎఫ్‌డిఐ ప్రభావితం అవుతుందనడం సరికాదన్న ఆయన ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, ఏ దేశంతోనూ పన్ను మినహాయింపు లేదా ప్రోత్సాహక ఒప్పందాలను కొనసాగించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. కాబట్టి ఇటీవల మారిషస్‌తో ఉన్న పన్ను ఒప్పందాల సవరణతో భారత్‌లో పెట్టుబడులు పెట్టే విదేశీ మదుపరులు.. మరో పన్ను మినహాయింపు దేశానికి వెళ్తారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దేశ ఆదాయానికి గండి కొడుతున్న పన్ను ఒప్పందాలను సవరించడం వల్ల దేశీయ వినియోగం పెరుగుతుందని చెప్పారు. 34 సంవత్సరాలుగా మారిషస్‌తో కొనసాగుతున్న పన్ను ఒప్పందాన్ని గత వారం కేంద్ర ప్రభుత్వం సవరించి, వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి మారిషస్ ద్వారా భారత్‌లోకి వచ్చే పెట్టుబడులపై పన్ను వేయాలని నిర్ణయించినది తెలిసిందే. ఈ నిర్ణయంపై వ్యాపార, పారిశ్రామిక వర్గాల నుంచి ఆందోళన వ్యక్తం అవుతుండగా, ఇప్పటికే స్టాక్ మార్కెట్లపై ఈ ప్రభావం కూడా కనిపించింది. విదేశీ మదుపరులు పెట్టుబడుల ఉపసంహరణకు దిగడంతో సూచీలు నష్టపోయాయి. బుధవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 175.51 పాయింట్లు కోల్పోగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 38.95 పాయింట్లు పడిపోయింది. మరోవైపు నిరుడు ఏప్రిల్-డిసెంబర్ మధ్య భారత్‌లోకి వచ్చిన 29.4 బిలియన్ డాలర్ల ఎఫ్‌డిఐలో 17 బిలియన్ డాలర్లు మారిషస్, సింగపూర్ దేశాల నుంచి వచ్చినవే. ఈ నేపథ్యంలో మారిషస్‌తో పన్ను ఒప్పందం సవరణ తప్పకుండా ప్రతికూల ప్రభావం చూపిస్తుందని మెజారిటీ నిపుణులు విశే్లషిస్తున్నారు.