బిజినెస్

తెలుగుసహా 12 భాషల్లో స్నాప్‌డీల్ మొబైల్ షాపింగ్ సౌకర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: ఆన్‌లైన్ మార్కెటీర్ స్నాప్‌డీల్ మంగళవారం.. మొబైల్ ఫోన్ ద్వారా మొత్తం 12 భాషల్లో షాపింగ్ చేసే సౌకర్యాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. స్నాప్‌డీల్ మొబైల్ యాప్‌పైనే ఈ వెసులుబాటు ఉంటుందని, వెబ్‌సైట్‌లో ఉండబోదని స్పష్టం చేసింది. జనవరి 26 నుంచి హిందీ, తెలుగుతోపాటు గుజరాతి, తమిళ్, మరాఠి, బెంగాళీ, కన్నడ, మలయాళం, ఒరియా, అస్సామీ, పంజాబీ భాషల్లో కస్టమర్లు తమ స్మార్ట్ఫోన్ల ద్వారా స్నాప్‌డీల్ యాప్ నుంచి షాపింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇంగ్లీషులోనే షాపింగ్ చేయాల్సి వస్తున్నది తెలిసిందే.
లక్షకుపైగా బీట్ కార్లను
రీకాల్ చేస్తున్న జనరల్ మోటార్స్
న్యూఢిల్లీ, డిసెంబర్ 15: జనరల్ మోటార్స్ ఇండియా తమ చెవర్‌లెట్ బీట్ డీజిల్ వేరియంట్‌కు చెందిన లక్షకుపైగా కార్లను రీకాల్ చేస్తోంది. 2010 డిసెంబర్ నుంచి 2014 జూలై మధ్య తయారైన ఈ కార్లలో క్లచ్ పెడల్ లివర్‌లో లోపాలున్నట్లు తేలింది. దీంతో దీన్ని సరిదిద్దేందుకే ఈ రీకాల్‌కు దిగుతోంది జనరల్ మోటా ర్స్. ఇందులో భాగంగానే 1,01,597 యూనిట్లను రీకాల్ చేస్తుండగా, అవసరమైతే క్లచ్ పెడల్ లివర్‌ను మార్చుతామని కూడా సంస్థ స్పష్టం చేస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న 248 చెవర్‌లెట్ సర్వీస్ సెంటర్లలో సమస్యను పరిష్కరిస్తున్నట్లు ఓ ప్రకటనలో మంగళవారం జనరల్ మోటార్స్ తెలిపింది.