బిజినెస్

బీమా రంగంపై 26, 27 తేదీల్లో సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 18: ఇన్సూరెన్స్ డాటా ఎనలిటిక్స్, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌పై అంతర్జాతీయ సదస్సును ఈ నెల 26, 27 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు ఐఆర్‌డిఎ చైర్మన్ టిఎస్ విజయన్ తెలిపారు. బీమా కంపెనీల రేట్ మేకింగ్, బీమా విశే్లషణలు, బీమాలో ఆర్థిక సమ్మిళితం, జీవిత బీమా విశే్లషణలు, విపత్తు నిర్వహణ, ఫైనాన్సింగ్‌పై ఈ సదస్సులో చర్చిస్తారు. జపాన్, థాయిలాండ్, తైవాన్, కొరియా, మలేసియా, చైనా తదితర దేశాల బీమా రంగ నిపుణులు ఈ సదస్సులో పాల్గొంటారు. రెగ్యులేటరీ, దేశంలోని వివిధ జీవిత, నాన్‌లైఫ్ బీమా రంగాల నిపుణులు పాల్గొంటారని విజయన్ బుధవారం ఇక్కడ ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో తెలియజేశారు. కేంద్ర పాలసీ ప్రణాళిక సంయుక్త కార్యదర్శి డాక్టర్ వి తిరుప్పుగజ్, నేషనల్ డిజాస్టర్ మేనేజిమెంట్ అథారిటీ చైర్మన్ కజునోరీ ఓనో తదితరులు కూడా పాల్గొంటారని విజయన్ వివరించారు.

విలేఖరులతో మాట్లాడుతున్న ఐఆర్‌డిఎ చైర్మన్ టిఎస్ విజయన్

‘అంతర్జాతీయ స్థాయి సంస్థలు అవసరం’
న్యూఢిల్లీ, మే 18: అంతర్జాతీయ సంస్థల అవసరం ఉందని, ప్రభుత్వరంగ సంస్థల ఏకీకృత విధానానికి తాము అనుకూలమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం సిఎన్‌బిసి టివి 18 ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అనుబంధ బ్యాంకులను విలీనం చేసుకోవాలన్న ప్రతిపాదనను మంగళవారం ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ ప్రకటించిన నేపథ్యంలో జైట్లీ పైవిధంగా వ్యాఖ్యానించారు. ఎస్‌బిహెచ్‌తోసహా ఐదు అనుబంధ బ్యాంకులతోపాటు భారతీయ మహిళా బ్యాంక్‌ను విలీనం చేసుకోవాలనుకుంటున్నట్లు ఎస్‌బిఐ చెప్పినది తెలిసిందే.