బిజినెస్

సంస్కరణల్లోనూ రాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, మే 22: సంస్కరణలు, ఆర్థికపరమైన అంశాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ మరోసారి తనదైన శైలిలో స్పందించారు. దేశంలో నిర్మాణాత్మక సంస్కరణలను వేగవంతం చేయడానికి రాజకీయంగా అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయని అన్నారు. వృద్ధిరేటు బలోపేతానికి ద్రవ్యోల్బణం అదుపు, బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిల నిర్మూలన ప్రక్రియకూ రాజకీయ అవాంతరాలు ఎదురవుతున్నాయని రాజన్ వ్యాఖ్యానించారు. లేబర్ మార్కెట్ సంస్కరణలు వృద్ధిరేటు పురోగతికి దోహదపడతాయని, కాని వాటిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని తెలిపారు. శనివారం రాత్రి ఇక్కడ ‘ది గ్లోబల్ ఎకానమీ అండ్ ఇండియా’పై ప్రసంగిస్తూ పైవిధంగా స్పందించారు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) మాజీ ముఖ్య ఆర్థికవేత్త కూడా అయిన రాజన్. కాగా, అంతర్జాతీయ ఆందోళనకర పరిస్థితుల నుంచి భారత్ సురక్షితమేనన్న రాజన్.. గత రెండేళ్లుగా వర్షాలు పడక కరవు పరిస్థితులు నెలకొన్నా 7.5 శాతం వృద్ధిరేటు నమోదవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థపై విదేశాల్లో రాజన్ చేసిన ‘గుడ్డివాళ్ల రాజ్యంలో ఒంటి కన్నువాడే రాజు’ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతున్న నేపథ్యంలో ఈ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ సెప్టెంబర్‌తో పదవీకాలం ముగియనున్న క్రమంలో మరోసారి ఆర్‌బిఐ గవర్నర్‌గా పనిచేయాలని కోరుకుంటున్నట్లు రాజన్ వీలు చిక్కినప్పుడల్లా చెబుతుండగా, బిజెపి ఎంపి సుబ్రమణ్యన్ స్వామి రాజన్‌కు ఆ అవకాశం ఇవ్వవద్దని బహిరంగంగానే తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
రాజన్‌ను పొడిగించాలి: గోద్రెజ్
న్యూఢిల్లీ: మరోసారి రాజన్‌ను ఆర్‌బిఐ గవర్నర్‌గా కొనసాగిస్తే దేశానికి మంచి జరుగుతుందని అన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆడీ గోద్రెజ్. రాజన్ మూడేళ్ల పదవీకాలం ముగియనున్న క్రమంలో దీనిపై వస్తున్న ఊహాగానాలపై గోద్రెజ్ స్పందిస్తూ.. ‘రాజన్ తన విధి నిర్వహణను చాలా బాగా నిర్వర్తిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు మంచి పేరుంది. గౌరవనీయులు, సమర్థులు. అలాంటి రాజన్‌ను ఆర్‌బిఐ గవర్నర్‌గా మళ్లీ నియమిస్తే దేశానికి అన్నివిధాలా మంచే జరుగుతుంది.’ అన్నారు.

ఏపిలో సింగరేణి ప్రాజెక్టుకు లైన్‌క్లియర్
న్యూఢిల్లీ, మే 22: ఆంధ్రప్రదేశ్‌లో సింగరేణి ఓపెన్‌కాస్ట్ కోల్ మైనింగ్ ప్రాజెక్టుకు పర్యావరణ అడ్డంకులు తొలిగాయి. ప్రాజెక్టు అభివృద్ధికి పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సు చేసింది. ఖమ్మం డివిజన్‌లోగల లంకపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లోని 776.20 హెక్టార్ల అటవీ భూమిని బొగ్గు తవ్వకాలకు వినియోగించుకోవచ్చని ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ (ఎఫ్‌ఎసి) స్పష్టం చేసింది. సింగరేణి సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఉమ్మడి సంస్థ. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) ఆరంభంలో 10 కొత్త ప్రాజెక్టులను చేపట్టే యోచనలో ఉన్నట్లు తెలిపిన సింగరేణి.. ఆ ప్రాజెక్టులను బెల్లంపల్లి, కొత్తగూడెం, మణుగూరు తదితర ఏరియాల్లో తీసుకొస్తోంది.